Feeding Pegions | పావురాలకు దాణా వేస్తున్నారా? పోతారు.! ఇలా వేస్తేనే.. పుణెలో ఒకరు పోయారు..!

పుణెలో మాజీ కార్పొరేటర్‌ శామ్‌ మంకర్‌ తన కుమార్తెను పావురాల ఇన్ఫెక్షన్‌ వల్ల కోల్పోయి, ప్రజలకు హెచ్చరిక ఇచ్చారు. పీజన్‌ బ్రీడర్‌ లంగ్‌ అనే వ్యాధి ఊపిరితిత్తులను నాశనం చేసి, ప్రాణాలను హరిస్తుంది.

Feeding Pegions | పావురాలకు దాణా వేస్తున్నారా? పోతారు.! ఇలా వేస్తేనే.. పుణెలో ఒకరు పోయారు..!

Former Pune Corporator Loses Daughter to Pigeon-Borne Lung Disease

(విధాత నేషనల్​ డెస్క్​)

పుణె:

పుణెలో మాజీ కార్పొరేటర్‌ శామ్‌ మంకర్‌ జీవితం ఒక్కసారిగా తల్లకిందులైంది. ఆయన కుమార్తె శీతల్‌ విజయ్‌ షిండే (39) 2017లో తీవ్రమైన దగ్గుతో బాధపడటం ప్రారంభించింది. మొదట ఇది సాధారణ జలుబు అనుకుని స్థానిక వైద్యులను, ఆయుర్వేద నిపుణులను సంప్రదించారు. కానీ దగ్గు తగ్గకపోవడంతో చివరకు క్యాంప్‌లోని ఒక వైద్యుడు అడిగిన ప్రశ్న వారిని షాక్‌కు గురిచేసింది — “మీరు ఉండే చోట పావురాలు ఉన్నాయా?” అని.

Former Pune Corporator Loses Daughter to Pigeon-Borne Lung Disease

ఆ ప్రశ్న వెనుక ఉన్న నిజం భయంకరమైనది. శీతల్‌ నివాసం ఉన్న ఫ్లాట్‌ పై అంతస్తులో పావురాలకు ధాన్యం వేస్తుండటంతో అవి అక్కడే గూళ్లు కట్టుకున్నాయి. వాటి విసర్జన ఎండిపోగా, ఆ ధూళి గాలిలో కలసి ఊపిరితిత్తుల్లోకి చేరింది. వైద్యులు నిర్ధారించిన వ్యాధి పేరు — “పీజన్‌ బ్రీడర్‌ లంగ్‌” (Pigeon Breeder’s Lung) లేదా “Hypersensitivity Pneumonitis (HP)”. ఈ వ్యాధికి మూల కారణం, పావురాల విసర్జనలోని సూక్ష్మ ప్రోటీన్లు, ఫంగస్‌ స్పోర్స్‌ (Cryptococcus, Histoplasma). ఇవి గాలిలోకి కలసి మనం శ్వాస తీసుకునే సమయంలో ఊపిరితిత్తుల్లోకి చేరుతాయి. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ దీన్ని ప్రమాదకరమని తప్పుగా గుర్తించి తన ఊపిరితిత్తులపైనే దాడి చేస్తుంది. దాంతో లంగ్​ ఇన్ఫెక్షన్​, ఫైబ్రోసిస్​ ఏర్పడతాయి.

The Hidden Danger Behind Feeding Pigeons in Cities

మొదట శీతల్‌కి సాధారణ దగ్గు ఉన్నా, క్రమంగా నడవడమే కష్టమైంది. రాత్రిళ్లు నిద్ర పట్టకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. చివరికి ఆమె 24 గంటలూ ఆక్సిజన్‌పై ఆధారపడాల్సి వచ్చింది. పుణె డీవై పాటిల్‌ హాస్పిటల్‌లో లంగ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ కోసం పేరు నమోదు చేశారు. రెండుసార్లు ఊపిరితిత్తులు దొరికినా, సరిపోలకపోవడంతో మార్పిడి జరగలేదు. చివరికి ఈ ఏడాది జనవరి 19న శీతల్‌ మరణించింది.

Experts Urge Citizens: Stop Feeding Pigeons, Start Protecting Health

తన కుమార్తెను కోల్పోయిన తర్వాత మంకర్‌ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ముందుకొచ్చారు. “పావురాల రెట్ట రెండు మూడు రోజుల తర్వాత పొడి రూపంలో మారి గాలిలో కలుస్తుంది. ఆ గాలి ఇంట్లోకి వస్తే మన ఊపిరితిత్తులు ప్రభావితం అవుతాయి. ఇమ్యూనిటీ తగ్గిన తర్వాత లక్షణాలు కన్పిస్తాయి,” అని ఆయన హెచ్చరిస్తున్నారు.

తెలుగు, తమిళ సినీ తార మీనా భర్త కూడా ఇలాగే పావురాల వల్ల వచ్చిన వ్యాధితోనే మరణించారు.

🫁 పీజన్‌ బ్రీడర్‌ లంగ్‌ — వ్యాధి వివరాలు

ఈ వ్యాధిని Hypersensitivity Pneumonitis అంటారు. దీర్ఘకాలం పావురాల ధూళి శ్వాసించడంతో ఊపిరితిత్తుల్లో వాపు (Inflammation) ఏర్పడుతుంది. క్రమంగా ఇది Fibrosis (స్కార్‌ టిష్యూ) గా మారి ఊపిరితిత్తులు గట్టి పడతాయి. దీని ఫలితంగా రక్తంలో ఆక్సిజన్‌ తగ్గిపోతుంది, శ్వాసలో ఇబ్బంది వస్తుంది, చివరికి ఊపిరితిత్తుల పనితీరు పూర్తిగా దెబ్బతింటుంది.

లక్షణాలు:

  • నిరంతర పొడి దగ్గు, శ్వాసలో ఇబ్బంది, అలసట, బరువు తగ్గడం, రాత్రిళ్లు నిద్ర రాకపోవడం చివరికి ఆక్సిజన్‌పై ఆధారపడటం

చికిత్స:

  • ప్రారంభ దశలో కార్టికోస్టిరాయిడ్‌ మందులు వాపు తగ్గిస్తాయి
  • ఊపిరితిత్తుల ఫంక్షన్‌ టెస్టులు, HRCT స్కాన్‌ ద్వారా స్థితి అంచనా
  • తీవ్రమైన దశలో Lung Transplant తప్ప వేరే మార్గం లేదు

సహజంగా వచ్చే ఇతర వ్యాధులు:

  • క్రిప్టోకోకోసిస్‌ (Cryptococcosis): మెదడు, ఊపిరితిత్తులను దెబ్బతీసే ఫంగస్‌ ఇన్ఫెక్షన్‌
  • హిస్టోప్లాస్మోసిస్‌ (Histoplasmosis): జ్వరం, ఊపిరితిత్తుల నష్టం కలిగించే వ్యాధి

🛡️ జాగ్రత్తలు మరియు నివారణ

Experts Urge Citizens: Stop Feeding Pigeons, Start Protecting Health

✅ పావురాలకు ధాన్యం వేయకండి
✅ బిల్డింగ్‌ బయట భాగాలను తరచూ శుభ్రం చేయండి
✅ పావురాల గూళ్లు ఉన్న చోటును మూసివేయండి
✅ శుభ్రం చేసే సమయంలో మాస్క్‌ ధరించండి
✅ దీర్ఘకాలిక దగ్గు ఉంటే వెంటనే పల్మనాలజిస్టు ని సంప్రదించండి

“పావురాలు ప్రకృతిలో మనకంటే ముందే ఉన్నాయి. అవి తమ ఆహారాన్ని తాము వెతుక్కునే సామర్థ్యం కలిగి ఉన్నాయి. మనం వాటికి ధాన్యం వేయడం వాటి సహజ జీవన విధానాన్ని మార్చడమే కాక, మన ఆరోగ్యానికీ ప్రమాదం తెస్తోంది.” అని మంకర్​ హెచ్చరిస్తున్నారు. తన లాగా మరెవరూ బాధపడకూడదని ఆయన ఆరాటం. ఆ ఆరాటమే పుణెలో మంకర్​ ప్రజల్లో అవగాహనాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ముంబైలో కూడా ప్రభుత్వం పావురాల దాణా కేంద్రాలు (కబూతర్‌ ఖానాలు) తొలగించే చర్యలు ప్రారంభించింది. వైద్యులు కూడా పావురాల విసర్జన వల్ల ఊపిరితిత్తుల వ్యాధులు పెరుగుతున్నాయని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే, ముంబై, పుణె నగరపాలక సంస్థలు పావురాలకు దాణా వేయడాన్ని నిషేధించి, అతిక్రిమించినవారికి జరిమానా కూడా విధిస్తున్నాయి.

Pigeon Droppings Turn Deadly — A Wake-Up Call

Former Pune corporator Sham Mankar lost his daughter to a rare lung disease caused by prolonged exposure to pigeon droppings. Doctors warn that dried pigeon waste can release toxic dust leading to Pigeon Breeder’s Lung and fatal fibrosis. The tragedy has sparked fresh awareness campaigns urging citizens to stop feeding pigeons in cities.