Couple Relation | భార్యాభర్తల మధ్య బంధం బలపడాలంటే.. ఈ ఏడు సూత్రాలు పాటించాల్సిందే..!
Couple Relation | భార్యాభర్తలు.. అన్యోన్యంగా ఉన్నప్పుడే వారి మధ్య బంధం బలపడుతుంది. ఇద్దరు భార్యాభర్తల మధ్య బంధం బలపడినప్పుడే.. ఆ ఇంట్లో కలహాలకు చోటు ఉండదు. చిన్న చిన్న ఘర్షణలు మినహాయిస్తే.. ఆ దంపతులు సంతోషంగా ఉంటారని చెప్పొచ్చు. అయితే భార్య సంతోషం కోసం వేల కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు.. ఆమెపై ప్రేమ వర్షం కురిపిస్తే చాలు. ఇక భర్త ఆనందం కోసం భార్య కూడా ఏదో చేయాల్సిన అవసరం లేదు. ఇంటికి వచ్చిన వెంటనే సాదరంగా ఆహ్వానం పలికితే చాలు.. భార్య ప్రేమానురాగాలకు భర్త కూడా పరవశించి పోతాడు.
Couple Relation | భార్యాభర్తలు.. అన్యోన్యంగా ఉన్నప్పుడే వారి మధ్య బంధం బలపడుతుంది. ఇద్దరు భార్యాభర్తల మధ్య బంధం బలపడినప్పుడే.. ఆ ఇంట్లో కలహాలకు చోటు ఉండదు. చిన్న చిన్న ఘర్షణలు మినహాయిస్తే.. ఆ దంపతులు సంతోషంగా ఉంటారని చెప్పొచ్చు. అయితే భార్య సంతోషం కోసం వేల కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు.. ఆమెపై ప్రేమ వర్షం కురిపిస్తే చాలు. ఇక భర్త ఆనందం కోసం భార్య కూడా ఏదో చేయాల్సిన అవసరం లేదు. ఇంటికి వచ్చిన వెంటనే సాదరంగా ఆహ్వానం పలికితే చాలు.. భార్య ప్రేమానురాగాలకు భర్త కూడా పరవశించి పోతాడు. అయితే ఈ ఏడు సూత్రాలు పాటిస్తే భార్యాభర్తల మధ్య బంధం మరింత బలపడుతుంది. మరి ఆ సూత్రాలు ఏంటో తెలుసుకుందాం..
ఏడు సూత్రాలివే..
1. భార్యాభర్తల మధ్య బంధం బలపడాలంటే.. బహుళ అంతస్తుల భవనాలు, బంగారు ఆభరణాలు అవసరం లేదు. ఇద్దరి మధ్య అర్థం చేసుకునే శక్తి ఉంటే చాలు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు భార్యాభర్తలిద్దరూ కలిసి ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటే చాలు. ఆ కష్టం నుంచి బయటపడిన మరుక్షణమే ఇద్దరి మధ్య ఎంత బలమైన బంధం ఉంటుందో తెలుస్తుంది. ఇక అప్పటి నుంచి ఆ దంపతుల జీవితం ఊహించనంతగా మారిపోతుంది.
2. భర్త పని మీద ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు.. ఎంత ఆనందంగా పంపుతామో.. ఇంటికి తిరిగి చేరుకునే సమయంలోనూ అదే చిరునవ్వుతో ఆహ్వానించాలి. భర్తను ప్రేమగా ఆహ్వానించి, అతనికి ఒక ముద్దు పెట్టి.. కాస్త టీ ఇచ్చి రిలాక్స్ చేస్తే సరిపోతుంది. అప్పుడు భర్త తన భార్యపై ఎంతో ప్రేమ కురిపిస్తాడు. భార్యే తన ప్రపంచంగా బతికేస్తాడు భర్త.
3. ఇక భర్త బాగోగులను మొత్తం భార్యనే చూసుకోవాలి. తన భర్త అవసరాలను ఇతరులకు అప్పగించకూడదు. భార్యనే సేవలు చేస్తే.. అప్పుడు భర్తకు భార్య విలువ తెలుస్తుంది. భార్య సేవలు ప్రేమతో కూడిన బాధ్యత అవుతుంది. కాబట్టి ఒకరికొకరు సేవలు చేసుకోవడంలో తప్పు లేదు.
4. భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఏకాంతంలో ఉన్నప్పుడు చాలా విషయాలు మాట్లాడుకుంటారు. ఏకాంతం అంటే శృంగారపరమైనవి మాత్రమే కాదు కుటుంబాలకు సంబంధించిన విషయాలు కూడా ఉంటాయి.. వాటిని ఎప్పుడూ మూడో వ్యక్తితో చెప్పకూడదు. అలా చెప్పినప్పుడు ఓసారి నమ్మకం కోల్పోతే ఆ బంధం బలహీనమైపోతుంది..
5. జీవిత భాగస్వామి హితులు, స్నేహితులు ఎవరో తెలుసుకుని వారు ఇంటికి వచ్చినప్పుడు సాదరంగా ఆహ్వానించాలి. అదే శత్రువులైతే వారిని కనీసం ఇంట్లో అడుగుపెట్టనీయకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలి..
6. తన ఆలోచనలో తనని ఉండనివ్వాలి కానీ భర్తను అదుపుచేయాలి అనుకోరాదు. ప్రేమ, బాధ్యతతో భాగస్వామిని అదుపు చేయాలి కానీ అందం, ఆకర్షణ, అజమాయిషీతో అదుపుచేసినా దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి అందం అనే పొగరు ఉండకూడదు. మంచి మనసుతో భర్తను గెలవాలి.
7. మోసం చేసే స్త్రీలు, అబద్ధాలు చెప్పే స్త్రీలు, ఎక్కువసమయం కుటుంబానికి దూరంగా ఉండే స్త్రీలు చెప్పిన మాటలు ఎప్పుడూ వినడం తగదు. ఇలాంటి స్త్రీలు బంధాలను నాశనం చేయడానికి వెనుకాడరు. కాబట్టి పక్కింటి స్త్రీపై వ్యామోహం పెంచుకోకూడదు. మొత్తంగా ఈ సూత్రాలు పాటిస్తే భార్యాభర్తల మధ్య బంధం మరింత బలపడి.. వారి సంసార జీవితం అన్యోన్యంగా సాగిపోతుంది.
Read more
24.. డెడ్‌లైన్ టార్గెట్.. 26!
Pulasa fish | గోదావరికి పులసొచ్చింది.. వలకు చిక్కిన కేజిన్నర చేప.. ధర ఎంత పలికిందంటే..!
Praneeth Hanumanthu | ఎవరీ యూట్యూబ్ సైకో… ప్రణీత్ హనుమంతు? |
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram