విధాత, హైదరాబాద్ : కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై దారుణ హత్యాచారానికి నిరసనగా ఎయిమ్స్ వైద్యులు చేపట్టిన 11రోజుల సమ్మెను గురువారం విరమించారు. సుప్రీంకోర్టు విజ్ఞప్తితో సమ్మెను విరమించుకున్నారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా, ప్రజాసేవా స్ఫూర్తితో డాక్టర్ల సమ్మెను విరమించినట్లు ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఆర్డీఏ) పేర్కొంది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటనను విడుదల చేసింది. కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై దారుణ హత్యాచారానికి నిరసనగా ఎయిమ్స్ వైద్యులు సమ్మెబాట పట్టగా, ఈ కేసుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో డాక్టర్లు సమ్మె విరమించి విధుల్లో చేరాలని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ గురువారం అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో 11 రోజుల సమ్మెను విరమిస్తున్నట్లు ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఆర్‌డీఏ) తెలిపింది. కోర్టు చర్యను అభినందిస్తున్నామని, కోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉండాలని నిర్ణయించినట్లు పేర్కొంది. పేషెంట్ కేర్ తమ మొదటి ప్రాధాన్యత అని వెల్లడించింది.
కాగా, ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ సంఘటన, దేశవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ సిబ్బంది భద్రతకు సంబంధించిన విస్తృత సమస్యను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టుకు ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ధన్యవాదాలు తెలిపింది. సుప్రీంకోర్టు అప్పీల్ మేరకు దేశ ప్రయోజనాల దృష్ట్యా, ప్రజాసేవా స్ఫూర్తితో 11 రోజుల సమ్మెను విరమించుకోవాలని నిర్ణయించినట్లు ప్రకటనలో పేర్కొంది.
Supreme Court | సుప్రీం కోర్టు విజ్ఞప్తితో ఏయిమ్స్ వైద్యుల సమ్మె విరమణ 11రోజుల సమ్మెకు తెర
కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై దారుణ హత్యాచారానికి నిరసనగా ఎయిమ్స్ వైద్యులు చేపట్టిన 11రోజుల సమ్మెను గురువారం విరమించారు. సుప్రీంకోర్టు విజ్ఞప్తితో సమ్మెను విరమించుకున్నారు

Latest News
12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్‌లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు