నేనిప్పుడు చీఫ్ మినిస్టర్.. ఫ్యూచర్లో తప్పకుండా ఐఏఎస్ ఆఫీసర్‌ను అవుతానని కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాడు. మరి ఆ వివరాలు, ఆ పిల్లాడి గురించి తెలుసుకోవాలంటే బెంగళూరులోని మురికి వాడల్లోకి వెళ్లాల్సిందే.
భవిష్యత్‌లో మీరు ఏమవుతారు అని పిల్లల్ని ప్రశ్నిస్తే.. ఇంజినీర్, డాక్టర్, లాయర్, టీచర్ అవుతామని చెబుతుంటారు. అప్పుడు వారిలో ఉన్న కాన్ఫిడెన్స్ చూస్తే చాలా ముచ్చటేస్తుంది. ఇక అందరూ అనుకున్నది సాధించలేరు. కానీ ఈ పిల్లాడు మాత్రం తప్పకుండా తన లక్ష్యాన్ని చేరుకుంటానని చెబుతున్నాడు. నేనిప్పుడు చీఫ్ మినిస్టర్.. ఫ్యూచర్లో తప్పకుండా ఐఏఎస్ ఆఫీసర్‌ను అవుతానని కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాడు. మీకు ఇక్కడ ఒక అనుమానం రావొచ్చు.. పిల్లాడు చీఫ్ మినిస్టర్ కావడం ఏంటి..? భవిష్యత్‌లో ఐఏఎస్ అవడం ఏంటి..? అనే సందేహం ఉండొచ్చు. మరి ఆ వివరాలు, ఆ పిల్లాడి గురించి తెలుసుకోవాలంటే బెంగళూరులోని మురికి వాడల్లోకి వెళ్లాల్సిందే.
చీఫ్ మినిస్టర్‌గా రాణిస్తున్న ఆ పిల్లాడి మాటల్లోనే.. నా పేరు నాగరాజు. నా వయసు 12 ఏండ్లు. ఆరో తరగతి చదువుతున్నా. నాకు పుస్తకాలు చదవడమంటే మహా ఇష్టం. అందులోనూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మహాత్మాగాంధీ పుస్తకాలు ఎక్కువగా చదువుతాను. అంబేద్కర్ రాజ్యాంగం రాశారు. ఆయనంటే నాకు ఎంతో గౌరవం. ఇక కబడ్డీ, క్రికెట్ ఆడుతాను. అన్నం, చికెన్, సాంబారు వంటి వంటకాలు చేస్తూ అమ్మకు సాయం చేస్తాను. ఎగ్ అమ్లేట్ కూడా వేస్తాను.
నేను జీవితంలో ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకుంటున్నాను. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరూ లాయర్లు, డాక్టర్లు, ఇంజినీర్లు కావాలనుకుంటున్నారు. వాళ్లకు భిన్నంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి మా ఫ్రెండ్స్ కంటే నేను స్పెషల్‌గా ఉండాలనుకుంటున్నాను. సో ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నదే నా టార్గెట్. సెకండ్ క్లాస్ నుంచి ఇప్పటి వరకు నేనే క్లాస్ ఫస్ట్. చెస్ కాంపిటీషన్లో కూడా ప్రథమ బహుమతి గెలుచుకున్నాను. అటు స్టడీస్, ఇటు గేమ్స్‌లో నేనే ఫస్ట్.. కాబట్టి స్కూల్లో జరిగిన ఎలక్షన్స్‌లో నన్ను చీఫ్ మినిస్టర్‌గా ఎన్నుకున్నారు. క్లాస్ లీడర్‌ను కూడా నేనే. భవిష్యత్‌లో ఎలాగైనా ఐఏఎస్ ఆఫీసర్ అవుతాను. అప్పుడు ఒక మంచి ఇల్లు కట్టుకుంటాను. ఎవరైతే ఆకలితో అలమటిస్తున్నారో వారికి కడుపు నిండా అన్నం పెట్టేందుకు ప్రయత్నిస్తాను అని నాగరాజు తన డ్రీమ్‌ను చెప్పాడు.