Tenth Class Pass | రూ. 40 లేక ఆగిన చదువు.. 56 ఏండ్ల వయసులో ‘పది’ పాసైన గుమాస్తా
Tenth Class Pass | చదవాలనే పట్టుదల, సంకల్పం ఉంటే చాలు.. వయసు అడ్డు రాదు. ఏ వయసులోనైనా చదివి.. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు. విజయాన్ని సాధించొచ్చు. ఓ వ్యక్తి కూడా 56 ఏండ్ల వయసులో పది పాసై( Tenth Class Pass ) నేటి యువతకు ఆదర్శంగా నిలిచాడు.

జార్ఖండ్( Jharkhand )లోని ఖూంటీ జిల్లాలోని కలామతి గ్రామానికి చెందిన గంగా ఓరన్( Ganga Oraon )(56) వృత్తిరీత్యా గుమాస్తా. ఆయనకు భార్య, పిల్లలు ఉన్నారు. తన విద్యాభ్యాసాన్ని 9వ తరగతిలోనే ఆపేశాడు. ఎందుకంటే పదో తరగతికి వెళ్లేందుకు అప్పట్లో రూ. 40 చెల్లించాలి. కానీ ఆ ఫీజు చెల్లించకపోవడంతో ఇంటికే పరిమితం అయ్యాడు.
ఇక గంగా గుమాస్తాగా కొనసాగుతున్నాడు. కానీ పదోన్నతి పొందలేకపోతున్నాడు. పది పాసైతే కానీ ఆయనకు పదోన్నతి లభించదన్న విషయాన్ని గ్రహించాడు. దీంతో తన 56 ఏండ్ల వయసులో పదో తరగతి ఎగ్జామ్స్ రాశాడు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో 47.2 శాతం ఉత్తీర్ణత సాధించి, నేటి తరానికి ఆదర్శంగా నిలిచాడు గంగా.
పదో తరగతి పాస్ కావడంతో గంగా, ఆయన కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. భార్యాపిల్లలు కలిసి గంగాకు సత్కారం చేశారు. స్వీట్లు తినిపించారు. పదో తరగతి పాస్ కావడం సంతోషంగా ఉందని, ఇప్పుడైనా తనకు పదోన్నతి లభిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయంలో కాంట్రాక్ట్ గుమాస్తాగా పని చేస్తున్న ఆయన రూ. 9 వేల జీతం పొందుతున్నారు. ప్రమోషన్ వస్తే ఆ జీతం కాస్త పెరగనుంది.