King Cobra | ఏం ధైర్యంరా బాబు.. నాగుపామును నమిలేసిన 9 నెలల చిన్నారి..
King Cobra | పాములను చూడగానే పిల్లలు( Childrens ) వణికిపోతారు. గుక్కపట్టి ఏడ్చుతారు. కానీ పసిపాప( Girl Child ) పామును చూసి ఏ మాత్రం భయపడలేదు. గుండెల నిండా ధైర్యంతో ఓ నాగుపాము( King Cobra )ను 9 నెలల చిన్నారి పళ్లతో నమిలేసి, అందర్నీ ఆశ్చర్యపరిచింది.
King Cobra | ఇది షాకింగ్ ఘటన. అభం శుభం తెలియని ఓ పసి బాలిక( Girl Child ) నాగుపాము( King Cobra )ను కసకస కొరికి నమిలేసింది. దీంతో పాము చనిపోయింది.. బాలిక కూడా సురక్షితంగా ఉంది. ఈ షాకింగ్ ఘటన ఛత్తీస్‌గఢ్( Chhattisgarh )లోని బస్తర్ జిల్లా( Bastar District )లో వెలుగు చూసింది.
బస్తర్ జిల్లాలోని పరాప పోలీసు స్టేషన్ పరిధిలోని కోయనార్ గ్రామానికి చెందిన ఓ ఇంట్లోకి నాగుపాము ప్రవేశించింది. ఆ ఇంట్లో 9 నెలల చిన్నారి ఉంటుంది. అయితే నాగుపామును చూసి.. దాన్ని ఆటబొమ్మగా భావించింది. ఇంకేముంది ఆ పాప పామును తన చేతుల్లోకి తీసుకొని పళ్లతో కొరికి నమిలేసింది. ఈ సమయంలో పాప తల్లి అనారోగ్యంతో మరో గదిలో విశ్రాంతి తీసుకుంటుంది. అయితే పాప ఏం చేస్తుందో చూద్దామని చెప్పి అప్పుడే తల్లి వెళ్లింది. పామును పట్టుకుని నములుతున్న దృశ్యాన్ని తల్లి షాక్‌కు గురైంది.
పాప నోట్లో ఉన్న పామును లాగి బయటకు విసిరేసింది. వెంటనే బిడ్డను ఆస్పత్రికి తీసుకెళ్లారు. లేక్ జగదల్‌పూర్‌లోని మెకాజా ఆస్పత్రి వైద్యులు పసిపాపను 24 గంటల పాటు పర్యవేక్షణలో ఉంచారు. ఆ బిడ్డకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో.. వైద్యులు డిశ్చార్జి చేశారు.
ఇక పసిపాప ధైర్యాన్ని చూసి గ్రామస్తులు అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. స్థానికులంతా మాన్విని చిన్న సింహరాశి అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram