Karnataka | కాళ్ళ పారాణి ఆరకముందే భార్యను నరికి చంపిన భర్త
కాళ్ళ పారాణి ఆరకముందే నూతన వధువును భర్త నరికి చంపిన ఘటన కోలార్ జిల్లాలో చోటుచేసుకుంది.
విధాత, హైదరాబాద్ : కాళ్ళ పారాణి ఆరకముందే నూతన వధువును భర్త నరికి చంపిన ఘటన కోలార్ జిల్లాలో చోటుచేసుకుంది. కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా కేజీఎఫ్ తాలూకాలో వరుడు నవీన్ (27), వధువు లిఖిత (18)లకు బుధవారం వివాహం కాగా పెళ్లి వేడుక అనంతరం విశ్రాంతి కోసం పక్కనే ఉన్న రూంలోకి వెళ్ళారు. ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో ఆవేశంతో భార్య లిఖితను నవీన్ కొడవలితో నరికి చంపి తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో పెళ్లి ఇంట్లో విషాదం రేగింది. వధూవరుల కుటుంబాలకు ఏం జరిగిందో అర్ధంకాక అంతా దుఃఖంలో మునిగిపోయారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram