Woman Paraded | ఆ నెపంతో.. మహిళకు చెప్పుల దండేసి అర్ధనగ్నంగా ఊరేగించారు..
Woman Paraded | నాగరిక సమాజంలో అనాగరికంగా ప్రవర్తించారు ఆ గ్రామస్తులు( Villagers ). దొంగతనం( Theft ) నెపంతో ఓ మహిళను అర్ధనగ్నంగా( Woman Paraded ) మార్చి.. ఆమె మెడలో చెప్పుల దండేసి( Slippers Garland ) ఊరేగించారు. ఈ అమానవీయ ఘటన జార్ఖండ్(Jharkhand ) గిరిధ్ జిల్లాలోని డమ్రీ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

Woman Paraded | నాగరిక సమాజంలో అనాగరికంగా ప్రవర్తించారు ఆ గ్రామస్తులు( Villagers ). దొంగతనం( Theft ) నెపంతో ఓ మహిళను అర్ధనగ్నంగా( Woman Paraded ) మార్చి.. ఆమె మెడలో చెప్పుల దండేసి( Slippers Garland ) ఊరేగించారు. ఈ అమానవీయ ఘటన జార్ఖండ్( Jharkhand ) గిరిధ్ జిల్లాలోని డమ్రీ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
డమ్రీ పోలీసు స్టేషన్ పరిధిలోని పిప్రాలి గ్రామానికి(Piprali village ) చెందిన ఓ ఇంట్లో ఇటీవల దొంగతనం జరిగింది. అయితే అదే గ్రామానికి చెందిన ఓ మహిళను గ్రామస్తులు దొంగగా చిత్రీకరించారు. అంతటితో ఆగకుండా ఆమెను నడి బజారుకీడ్చారు. అర్ధనగ్నంగా మార్చారు. జుట్టు కత్తిరించారు. ఆపై మెడలో చెప్పుల దండేసి.. వీధుల్లో తిప్పుతూ ఊరేగించారు. ఈ క్రమంలో కొందరు ఆ మహిళపై కర్రలతో తీవ్రంగా చితకబాదారు. ఈ దృశ్యాలను స్థానిక యువత తమ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
సమాచారం అందుకున్న డమ్రీ పోలీసులు పిప్రాలి గ్రామానికి చేరుకున్నారు. బాధిత మహిళను చేరదీసి.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మహిళను అర్ధనగ్నంగా ఊరేగించిన ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు.. ఓ ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. మహిళను వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.