సల్మాన్ నివాసంపై కాల్పుల కేసులో ఒకరి ఆత్మహత్య
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పుల కేసులో అరెస్టయిన ఇద్దరు ఆయధ సరఫరాదారుల్లో ఒకడు బుధవారం పోలీస్ కస్టడీలో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు

ముంబై: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పుల కేసులో అరెస్టయిన ఇద్దరు ఆయధ సరఫరాదారుల్లో ఒకడు బుధవారం పోలీస్ కస్టడీలో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. పంజాబ్‌లో ఏప్రిల్ 26న అనుజ్ తాపన్ (32), సోనుకమార్ చందర్ బిష్ణోయి (37) అరెస్టయారు. వీరిలో అనుజ్ తాపన్ ముంబై పోలీస్ క్రైం బ్రాంచ్ లాకప్‌లో ఆత్మహత్యకు ప్రయత్నించాడని, హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ చనిపోయాడని తెలుస్తున్నది. లాకప్‌లోని టాయిలెట్‌లో బెడ్‌షీటుతో ఉరేసుకుని చనిపోయాడు. వెంటనే జీటీ హాస్పిటల్‌కు తరలించగా.. చికిత్స అందిస్తుండగానే చనిపోయాడు’ అని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.
ముంబైలోని బాంద్రా ఏరియాలో సల్మాన్‌ఖాన్ నివసించే గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ బయట ఇద్దరు వ్యక్తులు ఏప్రిల్ 14న కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. అనంతరం పోలీసులు వికీ గుప్తా (24), సాగర్ పాల్ (21)ను గుజరాత్‌లో అరెస్టు చేశారు. తదనంతరం వారికి ఆయుధాలు సరఫరా చేసిన ఇద్దరినీ అరెస్టు చేశారు.