అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ కేసులో సిట్ అధికారులు కొనసాగిస్తున్న దర్యాప్తులో మరిన్ని కీలక ఆధారాలు లభించాయి. ఏప్రిల్ 27 నుంచి జూన్ 5 వరకు విరాళాలు కౌంటింగ్ చేసిన వ్యక్తులు డబ్బులు అపహరిస్తున్నట్లు సీసీటీవీ దృశ్యాల్లో కనిపించాయి. లెక్కించే సమయంలో కొంతమంది సిబ్బంది కరెన్సీ నోట్ల కట్టలను, చిల్లరను తమ దుస్తులు, జేబులు, బూట్లలో దాచిపెట్టినట్లు సీసీటీవీ రికార్డుల్లో కనిపించిందని సిట్ రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన నివేదికలో తెలిపింది. కేవలం ఈ 39 రోజుల విరాళాల లెక్కింపు కాలంలో దాదాపు 70 సార్లు ఆ వ్యక్తులు దొంగతనాలకు పాల్పడినట్లు సిట్ అధికారులు గుర్తించారు.
నిర్వహణ లోపాల నీడన దర్జాగా విరాళాల చోరీ
డబ్బును సిబ్బంది దొంగలిస్తున్నట్లుగా గమనించిన కొందరు అధికారులు కూడా వారిని ఆపడానికి ప్రయత్నించలేదని సిట్ పేర్కొంది.ఇందుకు సంబంధించిన ఆధారాలను సిట్ అధికారులు యూపీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పొందుపరిచారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న అవినాష్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవ్‌కుష్ మిశ్రా, మనీష్ కుమార్ యాదవ్, కరుణేష్ పాండే, రామశంకర్ మిశ్రాలకు విరాళాల మాయంతో ప్రమేయం ఉన్నట్లుగా నిర్ధారించారు. సీసీటీవీ దృశ్యాల్లో అవినాష్ శుక్లా, మనీష్ కుమార్ యాదవ్‌లు పలుమార్లు నగదు, నగలను అపహరిస్తున్నట్లు రికార్డ్ అయ్యిందని సిట్ తన నివేదికలో పేర్కొంది. ఆలయంలో భద్రతా తనిఖీలు, బయోమెట్రిక్ హాజరు, డిజిటల్ పరికరాలపై పరిమితులు, సీసీటీవీ పర్యవేక్షణ వంటి వాటిలో లోపాలను వినియోగించుకుని నిందితులు చోరీకి పాల్పడ్డారని తెలిపారు. నిందితులు విరాళాల చోరీతో భారీ ఎత్తున అక్రమాస్తులు పోగేసుకున్నారని విచారణలో సిట్ గుర్తించిన సంగతి తెలిసిందే.రామ మందిర విరాళాల చోరీ జూన్ 7న వెలుగులోకి వచ్చింది. యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా జూన్ 25న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఐదేళ్ల ఖాతాల రీఆడిట్ తో మరిన్ని ఆధారాలపై ఆశలు
విరాళాల చోరీ కేసు దర్యాప్తులో భాగంగా ట్రస్ట్ సభ్యులు, బ్యాంకు అధికారులు, భద్రతా సిబ్బంది, లెక్కింపు సిబ్బందిని విచారించారు. వారి వాంగ్మూలాల ప్రకారం ఏప్రిల్ 27కి ముందు కూడా విరాళాల చోరీ జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే పాత సీసీటీవీ ఫుటేజ్ అందుబాటులో లేకపోవడంతో ఈ విషయంలో ఆధారాలు సేకరించడం సిట్ కు సవాలుగా మారింది. విరాళాల చోరీ కేసులో మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు నిందితుల, ట్రస్టు లావాదేవిల ఐదేళ్ల ఖాతాలను రీఆడిట్ చేస్తున్నామని.. బ్యాంకు రికార్డులు, విరాళాల పత్రాలు, ఆలయ నిర్మాణ వ్యయాలు, బంగారం, వెండి వస్తువులతో సహా అన్ని ఆర్థిక లావాదేవీల రికార్డులు పరిశీలిస్తున్నామని సిట్ అధికారులు వెల్లడించారు.
అయోధ్య విరాళాల మాయ కేసులో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి పదవికి చంపత్‌రాయ్ డ్రైవర్ సహా ఎనిమిది మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇందులో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే విషయంపై సిట్ దర్యాప్తు కొనసాగిస్తోంది. విరాళాల మయంపై నైతిక బాధ్యతగా ట్రస్ ప్రధాన కార్యదర్శి పదవికి చంపత్ రాయ్ రాజీనామా చేయడం..ఆయన స్థానంలో యూపీ హర్ధోయ్ కి చెందిన ఆరెస్సెస్ సీనియర్ సభ్యుడు, ఇండియన్ ఫారెస్టు సర్వీస్ మాజీ అధికారి, ట్రస్టు శాశ్వత సభ్యుడు కృష్ణ మోహన్‌ను నియామితులయ్యారు.
ఆలయ విరాళాల లెక్కలు వెల్లడించిన ట్రస్టు
విరాళాల మాయం వివాదస్పదమైన నేపథ్యంలో అయోధ్య రామాలయానికి భక్తులు సమర్పించిన విరాళాలు, కానుకలు లెక్కలను శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది. రామాలయ నిర్మాణానికి 2020లో నిధి సమర్పణ్ అభియాన్ ప్రారంభించినప్పటి నుంచి రూ.3,264 కోట్లు వచ్చాయని తెలిపింది. ఆలయం ప్రారంభమైనప్పటి నుంచి భక్తుల కానుకల రూపంలో రూ.582 కోట్లు వచ్చాయని వెల్లడించింది. రామాలయ నిర్మాణానికి వచ్చిన రూ.3,264 కోట్ల విరాళాలలో రూ.2,370 కోట్లు ఆలయ నిర్మాణానికి వెచ్చించగా.. నిర్వహణ ఖర్చుల కోసం రూ.391 కోట్లు ఖర్చయ్యాయని తెలిపింది. మిగిలిన నిధులు బ్యాంకు ఖాతాల్లో ఉన్నాయని వివరించింది. భక్తులు అందించిన వెండి ఆభరణాలను కడ్డీలుగా మార్చి భద్రపరిచామని వెల్లడించింది. భక్తులిచ్చిన కానుకలకు లెక్కలు పక్కాగా ఉన్నాయని, ముందస్తు అనుమతితో వాటిని ఎవరైనా వచ్చి తనిఖీ చేయవచ్చని స్పష్టం చేసింది.
బంగారు రామ్ చరిత్ మానస్ పుస్తకం భద్రం
బంగారు పూత ఉన్న వందల ఏళ్ల రామ్ చరిత్ మానస్ పుస్తకం అదృశ్యంపై అయోధ్య ట్రస్టు క్లారిటీ ఇచ్చింది. రూ.5 కోట్ల విలువైన రామ్‌చరిత్ మానస్ పుస్తకం అదృశ్యమైందన్న ఆరోపణలను ట్రస్ట్ ఖండించింది. బంగారు పూతతో ఉన్న ఆ పుస్తకాన్ని మీడియా ముందు ప్రదర్శించింది. అలాగే ‘వెండి కాకి’ (కాకభుశుండి ప్రతిమ) సహా, వెండి పాదుకలు, కిరీటాలు ,వజ్రాల నెక్లెస్, స్వర్ణాభరణాలు వంటి 2,800 కానుకలను మీడియా ముందు ప్రదర్శించారు . కానుకగా వచ్చిన ప్రతి వస్తువుకు రిజిస్టర్ నిర్వహిస్తున్నామని స్పష్టం చేసింది.
అయితే భక్తులు రామాలయానికి సమర్పించిన అన్ని కానుకలు భద్రంగా ఉంటే అరెస్టులు ఎందుకు జరిగాయి? ట్రస్ట్ సభ్యులు ఎందుకు రాజీనామా చేశారు? అన్న ప్రశ్నలు సైతం ఎదురవుతున్నాయి. కేవలం ఒక రాజకీయ పార్టీని కాపాడటానికే ఈ లెక్కలను బయటపెట్టినట్లు ఉందని ఇతర రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. రామ మందిరానికి విరాళంగా వచ్చిన వెండికడ్డీలు, ఇటుకలు అదృశ్యమయ్యాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) కానుకుల మాయంపై పలు ప్రశ్నలు లేవనెత్తింది. వాటిలో ఆలయ నిర్మాణ ప్రక్రియ సమయంలో శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాకరే విరాళంగా ఇచ్చిన 4 కిలోల వెండి ఇటుక కూడా ఉంది. అయితే ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక సిట్, సుమారు 200 కిలోల బరువున్న వెండి కడ్డీలు దొంగిలించారనే వార్తలను తోసిపుచ్చింది. ఆలయం నుంచి ఎత్తుకెళ్లిన బంగారు ఆభరణాలను, వాటిని మళ్లీ గుర్తుపట్టకుండా చెరిపివేసి.. బిస్కెట్లుగా మార్చారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కానుకలను కర్ణాటక తరలించి కరిగించి విక్రయించడంతో నిందితులు సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలపై విచారణ చేస్తుంది.
-Gold Ramcharitmanas
-Silver Kakbhushundi
-Large silver necklace
-Silver Charan Padukas
were among the items that had been widely rumored in the media to be missing.
Today, the Trust presented all of them before the public.
Along with this, Swami Govind Dev Giri Ji… pic.twitter.com/kNMnOrgqDY
— Amitabh Chaudhary (@MithilaWaaala) July 6, 2026
