వాచ్ కోసం వేలంవెర్రి ! వీళ్లు మారరా?..

ఖరీదైన వాచ్ ల కోసం యువత వేలం వెర్రి పోకడలకు బెంగుళూరులో జరిగిన ఓ షాపింగ్ మాల్ ఘటన నిదర్శనంగా నిలిచింది. రూ.41,000 ప్రారంభ ధరతో వచ్చిన APxSwatch RoyalPop కొనుక్కోవడానికి తెల్లవారుజాము నుంచే షాపింగ్ మాల్ వద్ద యువత తోపులాటలకు దిగడం వైరల్ గా మారింది.

Reported by: Y.V. Narsimha Reddy | జాతీయం | May 18, 2026, 8:41 pm IST
Read Time: 2 mins
వాచ్ కోసం వేలంవెర్రి ! వీళ్లు మారరా?..

విధాత: ఐ ఫోన్ల కోసం…ఖరీదైన వాచ్ ల కోసం యువత వేలం వెర్రి పోకడలకు బెంగుళూరులో జరిగిన ఓ షాపింగ్ మాల్ ఘటన నిదర్శనంగా నిలిచింది. రూ.41,000 ప్రారంభ ధరతో వచ్చిన APxSwatch RoyalPop కొనుక్కోవడానికి తెల్లవారుజాము నుంచే షాపింగ్ మాల్ వద్ద భారీ క్యూలైన్లతో  పడిగాపులు పడ్డారు. షాప్ తెరిచే సమయానికి గేట్లు తోసుకుంటూ..పరస్పరం తొక్కిసలాటలు సాగించుకుంటూ పోటీలు పడి షాపులోకి దూసుపోయారు.

వారిని నియంత్రించేందుకు షాపు నిర్వాహకులు బౌన్సర్లను, పోలీసులను  సైతం ఏర్పాటు చేసిన వారు దూసుకొస్తున్న యువతను నియంత్రించలేకపోయారు. బెంగుళూరు వైట్ ఫీల్డ్ లోని షాపింగ్ మాల్ లో జరిగిన ఈ తోపులాట దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆధునిక యువత వేలం వెర్రి పోకడలకు ఇది మరో నిదర్శనంగా నెటిజన్లు చురకలేస్తున్నారు.