Bihar Boy Builds Aircraft at Home | టాలెంట్ కు సలామ్..రూ. 7వేల ఖర్చుతో మినీ విమానం!

బీహార్ యువకుడు అవనీష్ కుమార్ కేవలం రూ.7వేలతో స్క్రాప్‌ ముడిపదార్థాల్ని ఉపయోగించి మినీ విమానం తయారు చేశాడు. ఈ సృజనాత్మకత వీడియో వైరల్‌ అవుతోంది.

Bihar Boy Builds Aircraft at Home | టాలెంట్ కు సలామ్..రూ. 7వేల ఖర్చుతో మినీ విమానం!

Bihar Boy Builds Aircraft at Home | విధాత: టాలెంట్..క్రియేటివిటీ ఏ కొందరి సొత్తు కాదు..వినూత్నంగా సృజనాత్మకతతో ఆలోచించే వారికి కొత్త ఆవిష్కరణలు దాసోహం కావాల్సిందే. ఇందుకు బీహార్ కు చెందిన ఓ యువకుడు సాధించిన అద్భుత విజయం నిదర్శనంగా నిలుస్తుంది. బీహార్ యువకుడు అవనీష్ కుమార్ కేవలం ఒక వారంలోనే స్క్రాప్ ఉపయోగించి దాదాపు రూ. 7,000 ఖర్చుతో ఎగిరే విమానాన్ని సృష్టించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అవనీష్ కుమార్ కు ఆధునికమైన ల్యాబ్ లేదు..టెక్నాలాజీతో కూడిన టాప్ డిగ్రీ లేదు. పెద్ద పారిశ్రామిక వేత్తల, శాస్త్రవేతల సహకారం లేదు. పరిశోధనలకు డబ్బులు అందించేవారు అంతకన్నా లేరు. అయితేనేమి తనకున్న జిజ్ఞాసతో..కొత్త సాంకేతిక అద్బుతాన్ని చేసి చూపించాడు.

బీహార్ కు చెందిన అవనీష్ కుమార్ స్క్రాప్ మెటీరియల్‌లను ఉపయోగించి తన సొంత విమానాన్ని నిర్మించాడు. అంతేకాదు తన విమానం పనితీరును స్వయంగా నడిపి చూపించాడు. అనేక మంది యువకులు, ప్రజలు అతడి ప్రయోగాన్ని చూస్తూ కేరింతలు కొడుతూ అతడి విమానం గాల్లోకి ఎగురుతుంటే వెనుక పరిగెత్తి అభినందలు తెలిపారు. అవనీష్ కుమార్ ఘనతకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు మేరా భారత్ మహాన్ అని..దేశంలోని మట్టిలో మాణిక్యాలుగా ఉన్న పరిశోధకులకు ఇదే చక్కని నిదర్శనమన్నారు. అతడి మేధస్సును ప్రోత్సహిస్తే మరిన్ని అద్బుతాలు సృష్టిస్తాడని కామెంట్లు పెడుతున్నారు.

Also read: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు పహల్గాం దాడి ఉగ్రవాదుల హతం?