CEC Rajeev Kumar | సీఈసీ రాజీవ్‌కుమార్‌కు ‘జడ్’ కేటగిరి భద్రత

CEC Rajeev Kumar | న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల వేళ కీలక పరిమాణం చోటు చేసుకుంది. అత్యంత ప్రమాదం పొంచి ఉన్న రాజకీయ నాయకులకు వినియోగించే జడ్ కేటగిరి భద్రతను.. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్‌కు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్‌కు చెందిన 40 నుంచి 45 మంది సిబ్బంది సీఈసీ రక్షణ విధుల్లో నిమగ్నం కానున్నారు.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సీఈసీకి పొంచి ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. సీఈసీ భద్రతపై ఇటీవలే భద్రతా ఏజెన్సీలు కేంద్రానికి సిఫారసు చేశాయి. భద్రతా ఏజెన్సీల సిఫారసును పరిశీలించిన అనంతరం కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.