భారీగా పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర !

అమెరికా-ఇరాన్ యుద్దం మరోసారి భారతీయ గ్యాస్ వినియోగదారులపై భారీ ఆర్థిక భారం పడేసింది. హోటల్స్, రెస్టారెంట్లు, హాస్టల్స్ వంటి వాటిలో వినియోగించే కమర్షియల్(వాణిజ్య) గ్యాస్‌ సిలిండర్‌ ధర భారీగా పెరిగింది. ఒక్క సిలిండర్‌ (19 కేజీలు)పై సగటున రూ.993 పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దీంతో హోటల్స్, రెస్టారెంట్ల నిర్వాహకు పెరిగిన భారాన్ని వినియోగదారులపై మోపడం ఖాయంగా కనిపిస్తుంది.

భారీగా పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర !

అమెరికా-ఇరాన్ యుద్దం మరోసారి భారతీయ గ్యాస్ వినియోగదారులపై భారీ ఆర్థిక భారం పడేసింది. హోటల్స్, రెస్టారెంట్లు, హాస్టల్స్ వంటి వాటిలో వినియోగించే కమర్షియల్(వాణిజ్య) గ్యాస్‌ సిలిండర్‌ ధర భారీగా పెరిగింది. ఒక్క సిలిండర్‌ (19 కేజీలు)పై సగటున రూ.993 పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. పెంచిన ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చినట్లుగా పేర్కొన్నాయి. అయితే గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదని కేంద్రం వెల్లడించింది. ఇంధన రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి మార్గంలో నెలకున్న ఆటంకాల కారణంగా ధరల పెరుగుదల అనివార్యమైనట్లుగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ ధరలలో మార్పు లేదు..

ప్రస్తుతానికి పెట్రోల్‌, డీజిల్ ధరల్లో మాత్రం కేంద్రం ఎలాంటి పెంపు చేయలేదు. దేశీయ విమాన సంస్థలకు కూడా కేంద్రం ఊరట కల్పించింది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్‌ ధరల్లో ప్రస్తుతానికి ఎలాంటి మార్పు చేయలేదు. అయితే ఐదు కిలోల సిలిండర్ ధర రూ.914.50కి పెరిగింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే సిలిండర్ ధర పెరుగడం రెస్టారంట్లు, హోటల్స్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, బేకరీల వ్యాపారాన్ని దెబ్బతీస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా హెటల్స్, రెస్టారెంట్ల నిర్వాహకులు ఆ భారాన్ని వినియోగదారులపై మోపడం ఖాయంగా కనిపిస్తుంది.

యుద్దం ఎఫెక్ట్ తో మూడుసార్లు పెరిగిన ధరలు

అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్దం ఫిబ్రవరిలో ప్రారంభంకాగా.. అప్పటి నుంచి వాణిజ్య సిలిండర్ ధరను మూడుసార్లు పెంచారు. మార్చిలో రూ.144, ఏప్రిల్‌ ఒకటిన రూ.195, ఇప్పుడు ఒక్కసారిగా ఏకంగా రూ.993 పెంచేయడం వినియోగదారులకు షాక్ ఇస్తుంది. దీంతో ఒక్కో కమర్షియల్ సిలిండర్ ధర రూ.3వేలు దాటినట్లయ్యింది. హైదరాబాద్‌లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.3,315కు చేరింది. ఢిల్లీలో రూ.3,071గా ఉంది.

గృహ వినియోగదారులకు ఊరట..

వాణిజ్య సిలిండర్ ధరలు భారీగా పెరిగినా.. గృహ వినియోగానికి ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో సాధారణ ప్రజలకు కొంత ఊరట లభించింది. గృహ వినియోగ సిలిండర్ ధరలను స్థిరంగా ఉంచడం ద్వారా ప్రజలపై ఆర్థిక భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవడం సామాన్యులకు ఊరటనిచ్చింది.

ఇవి కూడా చదవండి :

తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్
ఆర్థిక శాఖలో 14 మందికి షోకాజ్ నోటీసులు? ఆమ్యామ్యాలు పెద్దవాళ్లకు, నోటీసులు అధికారులకా..