• Telugu News
  • /National

India LPG cargo| భారత్‌కు చేరిన మరో ఎల్పీజీ కార్గో షిప్, చమురు నౌక

పశ్చిమాసియ యుద్ద పరిస్థితుల నేపథ్యంలో భారత్ ఎదుర్కొంటున్న ఎల్పీజీ గ్యాస్, చమురు కష్టాల పరిష్కారం దిశగా భారీ ఊరటనిస్తూ మరో ఎల్పీజీ నౌక, చమురు నౌక మంగళూరు పోర్టుకు చేరాయి.

Reported by: Y.V. Narsimha Reddy | జాతీయం | Mar 22, 2026, 2:59 pm IST
Read Time: 3 mins
India LPG cargo| భారత్‌కు చేరిన మరో ఎల్పీజీ కార్గో షిప్, చమురు నౌక

విధాత : పశ్చిమాసియ యుద్ద పరిస్థితుల నేపథ్యంలో భారత్ ఎదుర్కొంటున్న ఎల్పీజీ గ్యాస్, చమురు కష్టాల పరిష్కారం దిశగా భారీ ఊరటనిస్తూ మరో ఎల్పీజీ నౌక, చమురు నౌక మంగళూరు పోర్టుకు చేరాయి. టెక్సాస్ నుంచి బయల్దేరిన ‘పైక్సిస్ పయనీర్’ నౌక ఈరోజు ఆదివారం మంగళూరు పోర్టుకు చేరుకుంది.ఈ ట్యాంకర్ ద్వారా 16,714 టన్నుల ఎల్పీజీ దిగుమతి అయింది.

సింగపూర్ జెండా కలిగిన ‘పైక్సిస్ పయనీర్’ అనే ఈ ట్యాంకర్ స్థూల డెడ్‌వెయిట్ 47,236 టన్నులు. ఈ నౌక ఫిబ్రవరి 14న పోర్ట్ ఆఫ్ నెదర్లాండ్ నుండి బయలుదేరి, ఏజిస్ లాజిస్టిక్స్ లిమిటెడ్ కోసం ఎల్పీజీని అన్‌లోడ్ చేస్తుంది. ఆ తర్వాత అది సోమవారం ఉదయం బయలుదేరుతుంది.

ఇప్పటికే ‘జగ్ లాడ్కీ’ ముడి చమురును, ‘నందాదేవి’, ‘శివాలిక్’ నౌకలు గ్యాస్ నిల్వలను విజయవంతంగా భారత తీరానికి చేరవేసాయి.

ఇప్పుడు రష్యన్ ముడి చమురును తీసుకువచ్చిన ‘ఆక్వా టైటాన్’ అనే రష్యన్ చమురు ట్యాంకర్ నౌక సైతం ఆదివారం మంగళూరు నౌకాశ్రయ ప్రాంతం వద్ద లంగరు వేసింది. దేశానికి కావాల్సిన ముడి చమురులో 88 శాతం, సహజ వాయువులో 50 శాతం, ఎల్పీజీలో దాదాపు 60 శాతం దిగుమతుల ద్వారానే అందుతోంది. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా,ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇంధన సరఫరా సర్కిల్ దెబ్బతిని దేశంలో ఇంధన కొరత నెలకొంది. అయితే తాజా షిప్‌మెంట్‌లతో పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయి.

వచ్చే వారం న్యూ మంగళూరు పోర్టుకు భారీ పరిమాణంలో ఎల్పీజీ రానుంది. ఈ నెల 29న అమెరికా నుండి 30,000 టన్నుల ఎల్పీజీతో కూడిన మరో ట్యాంకర్ ఇక్కడికి రావాల్సి ఉంది. మొత్తం సుమారు 72,700 టన్నుల ఎల్పీజీ రానుంది. ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని వార్తలు వస్తున్నాయి.