ట్రాఫిక్ జామ్ పై మంత్రిని నిలదీసిన మహిళపై కేసు!

ట్రాఫిక్ జామ్‌పై మంత్రిని నిలదీసిన మహిళపై కేసు నమోదు కావడం చర్చనీయాంశమైంది. మహారాష్ట్రలో ఈ ఘటన రాజకీయ వివాదంగా మారింది.

ట్రాఫిక్ జామ్ పై మంత్రిని నిలదీసిన మహిళపై కేసు!

విధాత : మహిళా రిజర్వేషన్(డీలిమిటేషన్) బిల్లు లోక్ సభలో వీగిపోవడంపై నిరసన సందర్బంగా ట్రాఫిక్ జామ్ కావడం పట్ల మహారాష్ట్ర మంత్రి గిగిరీష్ మహాజన్‌ను, పోలీస్ అధికారులను నిలదీస్తూ ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళపై పోలీస్ కేసు నమోదైంది. న్యాయవాది గుణరత్న సదావర్తే కుమార్తె జెన్ సదావర్తే ఆ మహిళపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మంత్రిపైన, పోలీస్ అధికారులపైన, మహిళ పోలీసులతో ఆ మహిళ దురుసుగా వ్యవహరించారని..’దూరంగా పో, నోరు మూసుకో, బయటకు వెళ్ళు, నాతో మాట్లాడకు’ వంటి అభ్యంతరకరమైన పదాలను ఉపయోగించారు అని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. ఇవి కేవలం అవమానకరమైన పదాలు మాత్రమే కాదు, ఇవి దేశాన్ని ఒక అడుగు వెనక్కి నెట్టేస్తాయి. ఆమె ప్రజా వ్యవస్థను అవమానించారు, రాజ్యాంగ యంత్రాంగాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించారని ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం.

అయితే మంత్రి గిరీష్ మహాజన్ ను నిలదీసిన మహిళలపై పోలీస్ ఫిర్యాదు వెనుక మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వం హస్తం ఉందని, ఆమెపై పోలీస్ కేసు నమోదు చేయడం అనుచిత చర్య అని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమె ట్రాఫిక్ జామ్ పట్ల నిలదీయం ..అలాంటి ట్రాఫిక్ జామ్ లతో ఎదురయ్యే ఇబ్బందుల పట్ల సగటు ప్రజల మనోభావాలకు ప్రతీక వంటిదంటూ ఆమెకు మద్దతు ప్రకటిస్తున్నారు.

బీజేపీ నిరసన సందర్బంగా ఆ మహిళ మంత్రి మహాజన్‌ ను నిలదీసే క్రమంలో ప్రజా రహదారులను దిగ్బంధించకుండా నిరసనను బహిరంగ ప్రదేశానికి మార్చాలని డిమాండ్ చేస్తూ కనిపించింది. “మీరు చెప్పాలనుకున్నది ఖాళీ ప్రదేశంలో చెప్పండి, ఇక్కడి నుండి వెళ్లిపోండి, ట్రాఫిక్‌ను ఆపవద్దు. వందలాది మంది వేచి ఉన్నారు,” అని ఆమే పేర్కొంది. ఈ ఘటన కాస్తా దేశ వ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదే సమయంలో మంత్రి గిరీష్ మహాజన్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ తాను వ్యక్తిగతంగా ఆ మహిళకు క్షమాపణ చెప్పానని, పది నిమిషాల్లో రోడ్లను క్లియర్ చేస్తామని హామీ ఇచ్చానని తెలిపారు. అయితే, ఆమె వాడిన భాష, నిరసనకారులపై సీసాలు విసరడం వంటి చర్యలు అనుచితమైనవని, ఆమోదయోగ్యం కానివని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆమెపై కేసు నమోదు కావడం చర్చనీయాంశమైంది.

ఇవి కూడా చదవండి :

ర్యాలీతో ట్రాఫిక్ జామ్.. మంత్రిపై మహిళ ఫైర్!
ఆప్ పార్టీలో తిరుగుబాటు..పార్లమెంటరీ పార్టీ బీజేపీలో విలీనం