ర్యాలీతో ట్రాఫిక్ జామ్.. మంత్రిపై మహిళ ఫైర్!
ముంబైలో బీజేపీ మహిళా సంకల్ప ర్యాలీతో ఏర్పడిన ట్రాఫిక్ జామ్ ఒక సామాన్య మహిళను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. బిడ్డను పికప్ చేసుకోవడానికి వెళ్తున్న ఆమె గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో ర్యాలీలో ఉన్న మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
విధాత : ముంబైలో బీజేపీ మహిళా సంకల్ప ర్యాలీతో ఏర్పడిన ట్రాఫిక్ జామ్ ఒక సామాన్య మహిళను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. బిడ్డను పికప్ చేసుకోవడానికి వెళ్తున్న ఆమె గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో ర్యాలీలో ఉన్న మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ట్రాఫిక్ జామ్ తో ఆగ్రహించిన ఆ మహిళ మంత్రి గిరీష్ మహాజన్ వద్దకు వెళ్లి..‘మీ నిరసనలేవో గ్రౌండ్‌లో చేసుకోండి.. జనాన్ని ఎందుకు ఇబ్బంది పెడతారు? అని ఆయనను నిలదీసింది.
అంతేకాదు మధ్యలో జోక్యం చేసుకున్న పోలీస్ అధికారిపై కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా మీరు మాట్లాడటం ఆపి..ట్రాఫిక్ క్లియర్ చేయండంటూ మండిపడ్డారు. మహిళల రిజర్వేషన్ల బిల్లు వీగిపోవడాన్ని నిరసిస్తూ చేపట్టిన ర్యాలీతో .మహిళల ఆగ్రహానికి గురికావడం మంత్రికి ఇబ్బందికరంగా తయారైంది. ఏ మహిళల కోసమైతే నిరసన ర్యాలీ చేపట్టమో..ఆ మహిళా లోకమే తమ నిరసనపై అసహనం వెళ్లగక్కడంతో మంత్రి సహా బీజేపీ శ్రేణులు ఖంగుతిన్నాయి.
ఎక్కడిక్కడ ప్రశ్నిస్తున్న సామాన్యులు..
ముంబై లో మంత్రి ప్రచార ఆర్భాటం కోసం ట్రాఫిక్ ఆపేస్తే..
నిలదీసిన మహిళ! #Mumbai pic.twitter.com/fqh2UQPn8D
— UttarandhraNow (@UttarandhraNow) April 21, 2026
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram