కర్ణాటక నూతన సీఎంగా డీకే శివకుమార్ ఇంకాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అంతకుముందే డీకే మంత్రివర్గం 13మంది జాబితా ఖరారైంది. ఉప ముఖ్యమంత్రిగా దళిత సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత జి.పరమేశ్వర ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
మాజీ సీఎం సిద్ధరామయ్య తనయుడు యతీంద్ర, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేలకు మంత్రివర్గంలో చోటు దక్కింది. కేహెచ్ మునియప్ప, ఎంబీ పాటిల్, రామలింగారెడ్డి, సతీశ్ జర్కిహోళి , కేజీ జార్జ్, కృష్ణ బైరేగౌడ, యూటి. ఖాదర్, ఈశ్వర్ కంద్రే, బైరాతీ సురేశ్, శరణ్ ప్రకాశ్ పాటిల్ ఇలా 13 మంది నేడు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు.
సీడబ్ల్యూసీ సభ్యుడిగా సిద్దరామయ్య
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కాంగ్రెస్ హైకమాండ్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.