Chhattisgarh | బీజాపూర్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్.. ఎనిమిది మంది మావోయిస్టుల మృతి

ఛ‌త్తీస్‌గడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పరిధిలో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. శుక్రవారం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 8మంది మావోయిస్టులు మృతి చెందారు

Chhattisgarh | బీజాపూర్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్.. ఎనిమిది మంది మావోయిస్టుల మృతి

కొనసాగుతున్న ఎదురు కాల్పులు

విధాత: ఛ‌త్తీస్‌గడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పరిధిలో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. శుక్రవారం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 8మంది మావోయిస్టులు మృతి చెందారు. ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. ఇటీవల గుంగుళూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 10మంది మావోయిస్టులు మృతి చెందిన ఎన్‌కౌంటర్ మరువకముందే మరో ఎన్‌కౌంటర్‌లో 8మంది మావోలు మృతి చెందారు.

ఛ‌త్తీస్‌గడ్ బీజాపూర్ జిల్లా సహా ఏడు జిల్లాల పరిధిలోని దండకారణ్యంలో ప్రాంతంలో జనవరి నుంచి నుంచి వరుసగా సాగుతున్నమావోయిస్టుల ఏరివేత ఆపరేషన్లతో 99మంది వరకు మావోయిస్టులు మృతి చెందినట్లుగా సమాచారం. 2019లో జరిగిన ఎన్‌కౌంటర్లలో 65మంది మావోయిస్టులు చనిపోయారు. 2020లో 36మంది, 2021లో 47మంది, 2022లో 30మంది , 2023లో 24మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. 2024లో ఇప్పటిదాకా 99మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో హతమయ్యారు. 209మంది అరెస్టు కాగా, 239మంది లొంగిపోయారు.