Chhattisgarh | ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు మృతి
Chhattisgarh | ఛత్తీస్‌గఢ్( Chhattisgarh )లోని దంతెవాడ( Dantewada ) - నారాయణపూర్( Narayanapur ) సరిహద్దుల్లో పోలీసులు( Police ) రక్తపుటేరులు పారించారు. ఏడుగురు మావోయిస్టులను( maoists ) కాల్చి చంపారు. ఆ ప్రాంతమంతా తుపాకుల గర్జనలతో, బుల్లెట్ల మోతతో మార్మోగిపోతోంది.

Chhattisgarh | రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్( Chhattisgarh )లో భారీ ఎన్‌కౌంటర్( Encounter ) చోటు చేసుకుంది. తుపాకులు గర్జించాయి. బుల్లెట్ల( Bullets ) మోత మోగింది. మావోయిస్టులకు( Maoists ) – పోలీసు( Police ) బలగాలకు మధ్య హోరాహోరి కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.
ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ( Dantewada ) – నారాయణపూర్( Narayanapur ) సరిహద్దుల్లో ఈ భారీ ఎన్‌కౌంటర్ జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. దంతెవాడ, నారాయణపూర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. ఘటనాస్థలి నుంచి భారీ సంఖ్యలో పోలీసులు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమైన ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.