Encounter | బీజాపూర్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్‌.. ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి

Encounter | బీజాపూర్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్‌.. ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి

Encounter : ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో మరోసారి ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. తెలంగాణ సరిహద్దు వెంబడి భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. గ్రేహౌండ్స్‌ సిబ్బంది, తెలంగాణకు చెందిన యాంటీ నక్సల్‌ దళం, ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు సంయుక్తంగా పుజారీ కాంకేర్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం కూంబింగ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తుండగా ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు.

Best Tourist Places | పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు ప్లాన్‌ చేస్తున్నారా..? వీటిపై ఓ లుక్కేయండి..! ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టుల నుంచి పోలీసులు మూడు తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా ప్రాంతంలో మావోయిస్టుల కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. కాగా, ఈ వారం మొదట్లో కూడా బీజాపూర్‌లో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో 13 మంది మావోయిస్టులు మరణించారు. వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు.

కాగా, గడిచిన కొన్ని రోజుల నుంచి బీజపూర్‌ జిల్లాలో తరచూ ఎన్‌కౌంటర్‌లు చోటుచేసుకుంటుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందోనని నిత్యం భయపడుతున్నారు.