Ganga River Drying Climate Change | గంగానది ఎందుకు ఎండిపోతోంది?

కోట్లాది మందికి జీవనాధారమైన గంగానది చరిత్రలో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఎండిపోతోంది. వాతావరణం, రుతుపవనాల్లో మార్పులు, కాలుష్యం, ఆనకట్టల నిర్మాణంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ఐఐటీ రూర్కీ అధ్యయనం వెల్లడించింది. దాదాపు 2,525 కి.మీ పొడవున ప్రవహించే గంగానదితో పాటు ఉపనదులను పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు.

Ganga River Drying Climate Change | గంగానది ఎందుకు ఎండిపోతోంది?

Ganga River Drying Climate Change | గంగా నదితో పాటు దాని ఉపనదులు ప్రపంచంలోని అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లో ఒకటిగా నిలిచాయి. హిమాలయా పర్వతాల నుంచి బంగాళాఖాతం వరకు ఇవి విస్తరించి ఉన్నాయి. 650 మిలియన్లకు పైగా ప్రజలకు అంటే దేశంలోని పావు వంతుకు ఆహారం అందించడంలో గంగా నది కీలకంగా ఈ నది ఉంది. ప్రపంచంలోని అనేక పెద్ద నదుల్లో ప్రవాహం, ఆ నదుల్లో నీటి వనరుల వంటి అంశాలను శాస్త్రవేత్తలు నమోదు చేశారు. వీటన్నింటితో పోలిస్తే గంగానది దాని వేగం, పరిమాణంలో ప్రత్యేకంగా ఉంది. ఐఐటీ రూర్కీకి చెందిన ప్రొఫెసర్ అభయానంద్ ఎస్ మౌర్య ఆధ్వర్యంలోని బృందం గంగానదిపై అధ్యయనం చేసింది. ఏళ్ల క్రితం ఏడాది పొడవునా ఈ నదిలో నీటి ప్రవాహం ఉండేది. బెంగాల్, బీహార్, వారణాసి, అలహాబాద్‌కు గంగా నదిలో పెద్ద పెద్ద పడవల్లో ప్రయాణం చేసే పరిస్థితి ఉండేది. ఒక తరం వారాల పాటు పొలాలకు ఈ నది నీటిని కాలువల ద్వారా అందించేవారు. ఇలాంటి నది ఇప్పుడు ఎండిపోతోంది. రెండు దశాబ్దాల క్రితం గంంగా నది పరివాహక ప్రాంతంలో నీటి ప్రవాహ డాటా పరిశీలిస్తే ఇది స్థిరంగా ఉందని సూచిస్తుంది. ఇందుకు ఈ ప్రాంతంలో వేలాది చేతిపంపుల ద్వారా నీటిని ప్రజలు ఉపయోగించేవారు. వేసవి కాలంలో వేడి కారణంగా ఈ నదిలో నీరు 58 శాతంగా ఆవిరి అవుతోంది. కాలువల ద్వారా నీటిపారుదల ప్రాజెక్టుల నుంచి నీటిని మళ్లిస్తున్నారు. ముఖ్యంగా నది ఎగువ, మధ్య ప్రాంతాల్లో నీటి లభ్యత తగ్గింది. గంగా పరివాహక ప్రాంతంలో భూగర్భ జలాలలను విపరీతంగా ఉపయోగించడంతో నది ప్రవాహం తగ్గుతోందని అధ్యయనం చెబుతోంది. వాతావరణ మార్పుల ప్రభావంతో నదికి వరద తగ్గుతోంది. గంగా నదికి ప్రాథమిక వనరుగా ఉన్న హిమానీ నదాలు వేగంగా కరుగుతున్నాయి. గంగోత్రి హిమానీ నదం రెండు దశాబ్దాల్లో దాదాపు కిలోమీటరు వెనక్కి తగ్గింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు హిమానీ నదాలను వేగంగా కరిగిస్తున్నాయి. ఇవి ఈ నది శాశ్వత ప్రవాహంపై ప్రభావం చూపుతున్నాయి.

వెయ్యికిపైగా ఆనకట్టలు, బరాజ్‌లు

వెయ్యికి పైగా ఆనకట్టలు, బరాజ్‌లు నదిని సమూలంగా మార్చివేశాయి. వాతావరణంలో మార్పులు ప్రధానంగా ప్రపంచం వేడేక్కుతున్న కొద్దీ రుతుపవనాలు మరింత అస్థిరంగా మారాయి. హిమానీ నదాలు ఆకస్మికంగా వరదలను తెస్తాయి. దీర్ఘకాలంలో దిగువకు ప్రవహించే నీరు తక్కువగా ఉంటుంది. హిమానీ నదాలను ఆసియా నీటి స్థంభాలు అని పిలుస్తారు. ఈ స్థంభాలు కుంచించుకుపోతున్న కొద్దీ గంగ, దాని ఉప నదుల్లో నీటి ప్రవాహం తగ్గుతోంది.

మానవ తప్పిదాలు

ఈ నది ఒడ్డున ఉన్న పట్టణాల నుంచి ప్రతి రోజూ మిలియన్ల లీటర్ల మురుగు నీరు నేరుగా గంగానదిలో కలుస్తోంది. అంతేకాదు ఈ నదిలోకి పరిశ్రమల నుంచి వెలువడుతున్న కెమికల్స్ విడుదల చేస్తున్నాయి. వ్యవసాయంలో ఉపయోగించే పురుగు మందులు, ఎరువులు, ఇతర రసాయనాలు యూట్రోఫికేషన్ కు కారణం అవుతున్నాయి. దీంతో నీటిలో జలచరాలు బతికే అవకాశాలు లేకుండా పోయాయి. మానవ శరీర కళేబరాలు కూడా నదిలో వేయడంకూడా కాలుష్యానికి కారణంగా మారింది. గంగా–బ్రహ్మపుత్ర బేసిన్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా క్షీణిస్తున్న జలాశయాల్లో ఒకటి. ప్రతి ఏటా 15-20 మి.మీ. భూగర్భ నీటిమట్టాలు తగ్గుతున్నాయి. ఈ భూగర్భ జలాల్లో ఎక్కువ భాగం ఆర్సెనిక్, ఫ్లోరైడ్ ఉంది. ఇది మానవ ఆరోగ్యంతో పాటు వ్యవసాయానికి ప్రమాదమేనని నిపుణులు చెబుతున్నారు. రుతుపవనాల్లో మార్పులతో తీవ్రమైన కరువులు, వరదలు సంభవిస్తాయి. ఇవి రెండు నది పర్యావరణ వ్యవస్థపై ఒత్తిడిని కలిగిస్తాయి. ఆనకట్టలు, బరాజ్ ల నిర్మాణం నది సహాజ ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుంది. ఇది జలచరాల వలసలను ప్రభావితం చేస్తోంది. అక్రమ ఇసుక తవ్వకం పర్యావరణ వ్యవస్థను దెబ్బతీస్తోంది.