Jail Photos : దేశ రాజధాని ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న పేరు మోసిన గ్యాంగ్‌స్టర్ నవీన్ బాలి తన మొబైల్ ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్ వాడుతున్నాడు. తన ఇన్ స్టా ఖాతా ద్వారా పలుమార్లు జైలు నుంచి జైలుకు సంబంధించిన ఫోటోలను కూడా అప్‌లోడ్ చేశాడు. ఈ మేరకు హర్యానా ఇంటెలిజెన్స్ విభాగం.. తీహార్ జైలు డైరెక్టర్ జనరల్‌కు, ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు లేఖ పంపింది.

దాంతో ఈ ఘటనపై విచారణకు స్పెషల్ సెల్, క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. జైలులో ఉన్న నవీన్ బాలిపై హత్య, దోపిడీ, హత్యాయత్నం తదితర కేసులు నమోదయ్యాయి. అతను నీరజ్ బవానా గ్యాంగ్‌లో ముఖ్యమైన సభ్యుడు. చాలా ఘటనల్లో అతను నీరజ్‌కి అసోసియేట్‌గా ఉన్నాడు. 2021లో రోహిణి కోర్టులో జితేంద్ర గోగిని హత్య చేసిన కేసులో కూడా పోలీసులు నవీన్ బాలీని నిందితుడిగా చేర్చారు.
కాగా, హర్యానా పోలీసులు నేరస్తుల సోషల్ మీడియా ఖాతాలను స్కాన్ చేస్తున్నారు. ఈ సమయంలో నవీన్ బాలి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో జైలు చిత్రాన్ని పోస్ట్ చేసినట్లు వెల్లడించారు. దీనికి సంబంధించి హర్యానా ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ అశోక్ మిట్టల్.. తీహార్ జైలు డైరెక్టర్ జనరల్ సతీష్ గోల్చా, ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు లేఖ రాశారు. మే, జూన్‌లో మూడు సార్లు ఫొటోలు అప్‌లోడ్ చేసినట్లు లేఖలో పేర్కొన్నారు.
చివరిసారిగా జూలై 8న ఇన్‌స్టాగ్రామ్‌లో జైలు నుంచి ఫొటోను అప్‌లోడ్ చేశాడు. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని చాలామంది కరుడుగట్టిన నేరస్థులు తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఫోటోలు-వీడియోలను అప్‌లోడ్ చేస్తున్నారు. అయితే వాటిని జైలు నుంచి అప్‌లోడ్ చేయడం లేదు. బయట ఉన్న వారి అనుచరులు అప్‌లోడ్ చేస్తున్నారు. కోర్టులో హాజరుపరిచే సమయంలో అతని వీడియోలను తీసి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో అప్‌లోడ్ చేస్తారు. కానీ నవీన్ బాలి పెట్టే ఫొటోలు జైలు నుంచి అప్‌లోడ్ అవుతున్నాయి.