గొరిల్లా పిల్లతో చిన్నారి ఆట.. వైరల్ వీడియో

పిల్లల కోసం తల్లి పడే ఆరాటం మనుషులతో పాటు జంతువులలోనూ కనిపిస్తుంటుంది. జంతు ప్రదర్శనశాలలో ఓ గొరిల్లా పిల్లతో ఓ చిన్నారి ఆడిన ఆటలో తల్లి గొరిల్లా చూపిన చొరవకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ప్రకృతి..వన్యప్రాణులు అందించే పాఠాలు అనేకం నాగరిక సమాజానికి ఆదర్శనీయంగా నిలుస్తుంటాయి. మనుషులు ప్రదర్శించే మానవత్వం..ప్రేమానురాగాలు వన్యప్రాణుల జాతులలోనూ కనిపిస్తుండం చూస్తుంటాం. పిల్లల కోసం తల్లి పడే ఆరాటం మనుషులతో పాటు జంతువులలోనూ కనిపిస్తుంటుంది. జంతు ప్రదర్శనశాలలో ఓ గొరిల్లా పిల్లతో ఓ చిన్నారి ఆడిన ఆటలో తల్లి గొరిల్లా చూపిన చొరవకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

జంతు ప్రదర్శన శాల సందర్శనకు వెళ్లిన ఓ చిన్నారి అద్దాల ఫెన్సింగ్ ఆవలివైపున పిల్ల గొరిల్లాతో సరదగా తాడు ఆటను ఆడటం మొదలుపెట్టింది. అద్దాల రంధ్రం గుండా ఓ ఎర్రటి గుడ్డ కట్టిన తాడును ఓ వైపు చిన్నారి, మరోవైపు పిల్ల గొరిల్లా లాగుతూ ఇద్దరు గెలుపు కోసం పోరాడుతున్నారు. ఇదంతా అక్కడే ఉన్న తల్లి గొరిల్లా చూస్తూ ఉంటుంది. ఓ దశలో తన పిల్ల గొరిల్లా ఓడిపోయే పరిస్థితిలో ఉండటంతో వెంటనే తల్లి గొరిల్లా ఆ తాడును బలంగా లాగి పిల్ల గొరిల్లాను గెలిపిస్తుంది. ఈ అకస్మిక ఘటనతో ఆ చిన్నారి ఆశ్చర్యానికి లోనవ్వగా…తనే గెలిచానంటూ ఆ పిల్ల గెరిల్లా కేరింతలు కొడుతూ..నాలుకతో ఆ చిన్నారిని వెక్కిరిస్తూ విజయోత్సవ సంబరాలు చేసుకుంటుంది. పిల్ల గొరిల్లా కెరింతలు చూసిన ఆ చిన్నారి తను ఓడిపోయానన్న ఆలోచన నుంచి బయటకు వచ్చి తను కూడా ఆనందంతో నవ్వడం వీడియోలో కనిపిస్తుంది.

ఈ వీడియోనూ ఒక తల్లి తన బిడ్డను ఓడిపోనిస్తుందా? అతన్ని గెలిపించడానికి ఆమె ఉత్సాహంగా రంగంలోకి దిగిందన్న క్యాప్షన్ తో ఎక్స్ లో పోస్టు చేయగా..అది కాస్తా వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు మనుషులైనా, జంతువులైనా తమ పిల్లల కోసం పడే ఆరాటం…తపన..ప్రేమానురాగాలు మాటల్లో చెప్పలేనివంటూ ఆ గొరిల్లా తీరును ప్రశంసిస్తున్నారు.

 

Latest News