• Telugu News
  • /National

LPG Refill Booking Rules : ఎల్పీజీ బుకింగ్ లో నో చేంజేస్ : కేంద్రం కీలక ప్రకటన

ఎల్పీజీ బుకింగ్ గడువుపై వస్తున్న వార్తలు అవాస్తవమని కేంద్రం స్పష్టం చేసింది. పాత నిబంధనల ప్రకారమే గ్యాస్ రీఫిల్ బుకింగ్ కొనసాగుతుందని తెలిపింది.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Mar 25, 2026, 5:04 pm IST
Read Time: 3 mins
LPG Refill Booking Rules : ఎల్పీజీ బుకింగ్ లో నో చేంజేస్ : కేంద్రం కీలక ప్రకటన

న్యూఢిల్లీ : వంటగ్యాస్‌ సిలిండర్‌ రీఫిల్‌ బుకింగ్‌ గడువును చమురు కంపెనీలు 35 రోజులకు పెంచినట్లు వస్తోన్న వార్తలపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. ఎల్పీజీ రీ ఫిల్లింగ్ బుకింగ్‌ సమయాల్లో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేసింది. పాత నిబంధనలకు అనుగుణంగానే బుకింగ్‌లు చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం శాఖ బుధవారం ప్రకటన విడుదల చేసింది.

రీఫిల్‌ బుకింగ్‌ గడువు పెంపుపై మీడియాలో వస్తోన్న వార్తలు అవాస్తవమని కొట్టిపారేసింది. గ్యాస్‌ బుకింగ్‌ సమయాల్లో ఎలాంటి మార్పులు లేవు అని, కనెక్షన్‌తో సంబంధం లేకుండా పట్టణ ప్రాంతాల్లో రీఫిల్‌ బుకింగ్‌కు 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల గడువు అలాగే కొనసాగుతోంది అని క్లారిటీ ఇచ్చింది. గ్యాస్‌ బుకింగ్‌ విషయంలో ఆందోళనలు వద్దు అని, అవసరం లేకపోయినా బుకింగ్‌లు చేయొద్దని కోరుతున్నాం అని కేంద్రం తమ ప్రకటనలో స్పష్టతనిచ్చింది.

అంతకుముందు ఎల్పీజీ కొరత నేపథ్యంలో డబుల్‌ సిలిండర్‌ ఉంటే గ్యాస్‌ బుకింగ్‌ మధ్య అంతరాన్ని 35 రోజులకు పెంచినట్లు సోషల్ మీడియాలో ప్రచారం నెలకొంది. సింగిల్‌ సిలిండర్‌కు 25 రోజులు, ప్రధానమంత్రి ఉజ్వల్‌ యోజన (పీఎంయూవై) వినియోగదారులకు సిలిండర్‌ బుకింగ్‌ గడువును 45 రోజులకు పెంచినట్లు మీడియాలో ప్రచారం జరుగడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అలాంటి వార్తలు అన్ని అవాస్తవం అని, వాటిని నమ్మరాదంటూ గ్యాస్ రీఫిల్లింగ్ బుకింగ్ పై స్పష్టత ఇస్తూ ప్రకటన జారీ చేసింది.

ఇవి కూడా చదవండి :

Chicken Shops Close : తెలంగాణలో ఏప్రిల్-1 నుంచి చికెన్ షాపులు బంద్!
NH-565 Highway: అందుబాటులోకి తెలంగాణ-తిరుపతి కొత్త రోడ్డు