Guru Sharnanand Ji Maharaj | తిరుమలకు ఒంటరిగా వచ్చిన గురు శర్నానంద్ జీ మహారాజ్ శ్రీకాళ హాస్తిలో గుర్తింపు

తిరుపతి వెంకన్నను దర్శించుకోవాలనుకున్న ఆలోచన వచ్చిందే తడవుగా శిష్యులను, ఇతరులను ఎవ్వరినీ కూడా ఇబ్బంది పెట్టొద్దని అనుకున్నారో ఏమో గురు శర్నానంద్ జీ మహారాజ్ జాడ చెప్పకుండా ఒంటరిగా తిరుమలకు వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు.

Guru Sharnanand Ji Maharaj | తిరుమలకు ఒంటరిగా వచ్చిన గురు శర్నానంద్ జీ మహారాజ్ శ్రీకాళ హాస్తిలో గుర్తింపు

వెంకన్నను దర్శించుకోవాలనిపించి శిష్యులకు చెప్పకుండా…

విధాత: తిరుపతి వెంకన్నను దర్శించుకోవాలనుకున్న ఆలోచన వచ్చిందే తడవుగా శిష్యులను, ఇతరులను ఎవ్వరినీ కూడా ఇబ్బంది పెట్టొద్దని అనుకున్నారో ఏమో గురు శర్నానంద్ జీ మహారాజ్ జాడ చెప్పకుండా ఒంటరిగా తిరుమలకు వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. అయితే స్వామీ ఏమయ్యాడో తెలియని శిష్యులు తీవ్ర ఆందోళనకు గురై పోలీసులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇంతకీ ఈ స్వామీ ఎవరంటే ఉత్తర భారత దేశంలో సుప్రసిద్దులైన మహాత్ములు గురు శర్నానంద్ జీ మహారాజ్. పేరు ప్రఖ్యాతులు గాంచిన ఈ మహారాజ్ ను యూపీ ముఖ్యమంత్రి యోగి, కేంద్ర మంత్రి అమిత్ షా తదితర రాజకీయ ప్రముఖులు కూడా అప్పుడప్పుడు దర్శించుకుంటారు. బౌద్ద భిక్షువు దలైలామ కూడా ఈ స్వామిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.

గురు శర్నానంద్ జీ మహారాజ్ ఇటీవల మథుర లోని తమ ఉదాసీన్ ఆశ్రమం నుండి ఎవరికీ చెప్పకుండా తిరుమలకు వచ్చారు.. శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకోవాలన్న ఆలోచన వచ్చిన వెంటనే ఆయన ఒంటరిగా తన శిష్యులేవారికీ చెప్పకుండా వచ్చేసారు. దీంతో ఆయన శిష్యులు భక్త జనులు తీవ్ర ఆందోళన కు గురయ్యారు.. అంతటా వెతికినప్పటికీ స్వామీ జాడ దొరకక పోవడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ విషయం తెలంగాణ లో ఉన్న ఆయన శిష్యులకు తెలియడంతో మహరాజ్ జాడ కోసం ఇక్కడ పోలీసుల సహాయం కోరారు. దీంతో ఏపీలో పోలీసులు కూడా వెతకడం అందరి ప్రయత్నం ఫలించింది మహారాజ్ జీ కాళహస్తి లో ఉన్నట్లుగా తెలిసింది. సమాచంర తెలుసుకున్న వెంటనే ఆయన శిష్యులు సోమవారం ఉదమయం శ్రీ కాళ హాస్తకి చేరుకొని తమ గురువును కలుసుకున్నారు.

మధుర నుంచి తిరుమలకు చేరుకున్న గురు శర్నానంద్ జీ మహారాజ్ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తలనీలాలు సమర్పించారు. శ్రీవారిని దర్శించుకోవాలనే ఆలోచన వచ్చిన వెంటనే తిరుమలకు వచ్చి తలనీలాలు సమర్పించి, అక్కడి నుంచి శ్రీకాళ హాస్తి క్షేత్రానికి చేరుకొని మహాశివుడిని దర్శించుకున్నారని ఆయన శిష్యులు తెలిపారు. శ్రీ కాళ హాస్తిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా స్వామి కదలికలను గుర్తించినట్లు తెలిసింది. ఈ మేరకు సీసీ కెమెరాలో ఉన్న ఆయన వీడియో బయటకు వచ్చింది.