బీజీపీకి లాభం.. ప్రతిపక్షాలకు నష్టం.. : పెరిగే సీట్లపై యోగేంద్రయాదవ్ విశ్లేషణ
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న డీలిమిటేషన్ బిల్లులో బీజేపీ బలహీనంగా ఉన్న ప్రాంతాలకు అన్యాయం జరిగేలా, బీజేపీ బలంగా ఉన్న ప్రాంతాలకు న్యాయం చేసేలా ఉందని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్ పేర్కొన్నారు. ఇవీ ఆ వివరాలు...
డీలిమిటేషన్ బిల్లులో దక్షిణాది రాష్ట్రాలకు ఏ మాత్రం అన్యాయం జరుగబోదని కేంద్ర ప్రభుత్వం ఢంకా బజాయించి చెబుతోంది. మరోవైపు ఉత్తరాదికి పెద్ద మొత్తంలో సీట్లు పెరుగుతుంటే.. జనాభా నియంత్రణకు కృషి చేసిన పాపానికి తాము గణనీయంగా నష్టపోతున్నామని దక్షిణాది రాష్ట్రాలు అంటున్నాయి. ఈ వాదనల మధ్య గురువారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు వాడివేడిగా సాగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ సెఫాలజిస్ట్, పొలిటికల్ యాక్టివిస్ట్ యోగేంద్ర యాదవ్.. ఒక ట్వీట్ చేస్తూ.. ప్రతిపాదిత బిల్లుతో ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరుగుతాయో, ఎన్ని కోల్పోతాయో లెక్క కట్టారు. నష్టపోయే రాష్ట్రాలు, లాభపడే రాష్ట్రాల రాజకీయ ప్యాట్రన్.. ఎక్కడ బీజేపీ బలంగా ఉందో అక్కడ పెరుగుదల, బీజేపీ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో తగ్గుదల స్పష్టంగా చూపిస్తున్నదని యోగేంద్ర యాదవ్ పేర్కొన్నారు.
అంచనా : మొత్తంగా 850 సీట్లకు లోక్‌సభ బలం పెరుగుతుంది. ఇందులో 35 సీట్లు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఉంటాయి. మిగిలినవి 2011 జనాభా లెక్కల ప్రకారం కేటాయిస్తారు.
లాభం/నష్టం అనే కాలమ్ అత్యంత కీలకమైనది. ఎందుకంటే 850 సీట్ల లోక్‌సభలో ఏ రాష్ట్రానికి ఎన్ని పెరుగుతాయి? ఏ రాష్ట్రానికి ఎన్ని తగ్గుతాయనేది ఉంటుంది.
ఇక్కడ లాభనష్టాలను ప్రస్తుతం రాష్ట్రాలకు ఉన్న సీట్ల వాటా అలానే కొనసాగిస్తే ఎన్ని సీట్లు వచ్చేవి అనేది పోల్చుకోవచ్చు.
ఉదాహరణకు కేరళ భాగస్వామ్యం కొత్త లెక్క ప్రకారం.. 23 సీట్లకు (అదనంగా 3) పెరుగుతుంది. కానీ.. ఇప్పుడు ఉన్న వాటా ప్రకారమే కేటాయింపులు చేస్తే ఏకంగా 31 స్థానాలకు పెరుగుతుంది. ఆ లెక్కన చూస్తే.. ఇక్కడ కేరళ 8 సీట్లను కోల్పోతున్నది. ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఉన్న వాటా ప్రకారం 125 సీట్లు రావాలి. కానీ.. కొత్త లెక్క ప్రకారం.. 138 సీట్లు రానున్నాయి. అంటే కొత్తగా 13 సీట్లు పెరుగుతాయని యోగేంద్ర యాదవ్ తెలిపారు.
ఇవీ ఆయన అంచనాలు..
రాష్ట్రం ప్రస్తుత సీట్లు 2011 ప్రకారం.. పెరిగే సీట్లు నష్టం/లాభం
తమిళనాడు 39 50 11 -11
కేరళ 20 23 3 -8
ఆంధ్రప్రదేశ్ 25 34 9 -5
ఒడిశా 21 29 8 -4
తెలంగాణ 17 24 7 -3
పశ్చిమబెంగాల్ 42 63 21 -3
కర్ణాటక 28 42 14 -2
పంజాబ్ 13 19 6 -1
ఛత్తీస్‌గఢ్ 11 17 6 0
అస్సాం 14 21 7 +1
గుజరాత్ 26 42 16 +1
హర్యానా 10 17 7 +1
జార్ఖండ్ 14 23 9 +1
మహారాష్ట్ర 48 78 30 +3
ఢిల్లీ 7 16 9 +5
మధ్యప్రదేశ్ 29 50 19 +5
రాజస్థాన్ 25 47 22 +8
బీహార్ 40 72 32 +9
ఉత్తరప్రదేశ్ 80 138 58 +13
నోట్ : లోక్‌సభలో 850 సీట్లు ఉంటాయనే అంచనాతో వేసిన ఈ గణాంకాలు ఈ సీట్లను 2011 జనాభా లెక్కల ప్రకారం పంచితే ఎలా ఉంటుంది? ప్రస్తుత వాటాను కొనసాగిస్తూ పెంచితే ఎలా ఉంటుంది అన్న అంచనాలను అనుసరించి..
Read Also |
మహిళా రిజర్వేషన్లకు సై..డీలిమిటేషన్ కు నో : ఖర్గే ప్రకటన
Murder | హైదరాబాద్‌లో ఘోరం.. అన్నను చంపిన తమ్ముడు
Vijay | కన్యాకుమారిలో ఎమోషనల్ మూమెంట్స్.. భార్య ఫోటో చూసి దళపతి విజయ్ స్పందన వైరల్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram