First Night Condition | నన్ను తాకాలంటే 90 లక్షలు ఇవ్వాల్సిందే.. శోభనం గదిలో పెళ్లికూతురి డిమాండ్.. తర్వాత ఏమైందంటే.!

First Night Condition | శోభనం గదిలో ఓ యువకుడికి కొత్త పెళ్లికూతురు షాకిచ్చింది. తనను ముట్టుకోవాలంటే 90 లక్షల డబ్బులు ఇవ్వాల్సిందేనని కండీషన్ పెట్టింది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ వింత ఘటన ఇప్పుడు వైరల్‌గా మారింది.

Reported by: Chandram | జాతీయం | Apr 15, 2026, 8:58 am IST
Read Time: 5 mins
First Night Condition | నన్ను తాకాలంటే 90 లక్షలు ఇవ్వాల్సిందే.. శోభనం గదిలో పెళ్లికూతురి డిమాండ్.. తర్వాత ఏమైందంటే.!

First Night Condition | శోభనం గదిలో ఓ యువకుడికి కొత్త పెళ్లికూతురు షాకిచ్చింది. తనను ముట్టుకోవాలంటే 90 లక్షల డబ్బులు ఇవ్వాల్సిందేనని కండీషన్ పెట్టింది. ఈ వింత నిబంధనకు ఒప్పుకోకపోవడంతో నగలన్నీ తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. ఎన్నో వివాదాల తర్వాత ఈ ఘటన కోర్టు మెట్లు ఎక్కింది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు వైరల్‌గా మారింది.

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లా జగదీశ్‌పూర్‌‌కు చెందిన గౌరవ్ అనే యువకుడికి కల్పన అనే యువతితో గత ఏడాది ఏప్రిల్ 29న వివాహం జరిగింది. కానీ కొత్త పెళ్లికూతురితో నూరేళ్ల జీవితాన్ని కలర్‌ఫుల్‌గా ఊహించుకున్న గౌరవ్‌కు ఫస్ట్ నైట్ రోజే నిరాశ ఎదురైంది. ఎన్నో ఆశలతో శోభనం గదిలోకి వెళ్లిన గౌరవ్‌కు వధువు ఒక వింత కండిషన్ పెట్టింది. తనతో కలవాలన్నా.. కనీసం తాకాలన్నా వెంటనే రూ.90 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. తాను అడిగినంత సొమ్ము ఇస్తేనే భార్యగా అన్ని కోరికలు తీరుస్తానని.. లేదంటే ముట్టుకోవడానికి కూడా వీల్లేదని భీష్మించుకుంది.

వధువు పెట్టిన కండీషన్‌తో వరుడు ఒక్కసారిగా మైండ్ ‌బ్లాంక్ అయ్యింది. ఆ తర్వాత షాక్ నుంచి తేరుకున్న వరుడు.. ఆమెతో వాదనకు దిగాడు. అది కాస్త పెద్దది కావడంతో వరుడి కుటుంబసభ్యులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. వాళ్లు చెప్పినా వినకపోవడంతో అమ్మాయి కుటుంబసభ్యులను పిలిపించారు. వారు వచ్చి నచ్చజెబుతారని అనుకుంటే వాళ్లు మరింత రచ్చ చేశారు. అనంతరం వధువు ఇంట్లో ఉన్న ఆభరణాలు అన్నింటినీ తసుకుని వెళ్లిపోయిందని గౌరవ్ కుటుంబసభ్యులు తెలిపారు.

నగలు తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయినప్పటికీ ఈ వివాదం సద్దుమణగలేదు. అదే ఏడాది జూలై‌లో వధువు కుటుంబసభ్యులు వచ్చిన గొడవకు దిగారని గౌరవ్ కుటుంబసభ్యులు తెలిపారు. వెంటనే రూ.90 లక్షలు ఇవ్వాలని.. లేదంటే గ్యాస్ లీక్ చేసి ఇంట్లో వాళ్లందర్నీ సజీవ దహనం చేస్తామని బెదిరించారని వాపోయారు. అయితే ఆ తర్వాత వాళ్లు వెళ్లిపోయినప్పటికీ.. గత నెలలో పరిస్థితి మరింత దారుణంగా తయారైందని పేర్కొన్నారు.

మార్చిలో మరోసారి తమ ఇంటికి వచ్చిన వధువు కుటుంబసభ్యులు బెదిరింపులకు దిగారని తెలిపారు. ఈసారి పీఎన్‌జీ గ్యాస్ పైప్‌లైన్ కనెక్షన్ పీకి, సజీవ దహనం చేసేందుకు యత్నించారని వెల్లడించారు. అయితే బాధితులు సమాచారం ఇవ్వడంతో సమయానికి ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కుటుంబాన్ని రక్షించారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అయితే ఈ పెళ్లిపై వరుడి కుటుంబసభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. డబ్బుల కోసమే కుట్ర పన్ని ఈ వివాహం చేసుకున్నారని ఆరోపించారు. మధ్యవర్తి ప్రమేయం కూడా కుట్రలో ఉన్నదని వరుడి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసుపై కోర్టులో విచారణ కొనసాగుతున్నది.

Read More:

Viral News | పిల్లాడిగా మింగిన థర్మామీటర్.. 20 ఏళ్ల తర్వాత కడుపులో బయటపడింది.. చైనాలో వింత ఘటన!

Viral News | ఎంత జీతం ఇస్తే అంతే పనిచేస్తా.. ఆఫీసులోనే రోజుకు 5 గంటలు నిద్రపోయిన ఉద్యోగిని..!