Droneshwar Mahadev : అద్భుత లింగాభిషేకం..ద్రోణేశ్వర్ మహాదేవ్ తీర్థస్థలం

గుజరాత్‌లోని ఉనా సమీపంలో, గిర్ అడవిలో ఉన్న 400 ఏళ్ల నాటి ద్రోణేశ్వర్ మహాదేవ్ శివాలయం అద్భుతానికి నిదర్శనం. ఇక్కడి శివలింగంపై నిరంతరం నీటి ధార పడుతూ ఉంటుంది. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందనేది నేటికీ మిస్టరీగా ఉంది.

Droneshwar Mahadev : అద్భుత లింగాభిషేకం..ద్రోణేశ్వర్ మహాదేవ్ తీర్థస్థలం

విధాత : పురాతన, చారిత్రాక దేవాలయాల విశిష్టత, ప్రత్యేకతలు మహిమాన్వితంగానే కాకుండా అద్బుతంగా, అశ్చరపరిచే విధంగా ఉంటూ విస్మయపరుస్తుంటాయి. భారత్ దేశం అలాంటి విశిష్ట దేవాలయాలకు నెలవుగా చెప్పవచ్చు. నిత్య అభిషేక ప్రియుడైన మహాశివుడికి నిరంతరం జలాభిషేకం జరిగే శివాలయాలు దేశంలో అరుదుగా కనిపిస్తాయి. అలాంటి వాటిలో ప్రత్యేకమైనదిగా భక్తుల పూజలందుకుంటుంది గుజరాత్‌లోని ద్రోణేశ్వర్ మహాదేవ్ ఉనా శివాలయం.

గుజరాత్‌లోని ఉనా సమీపంలోని గిర్ అడవిలో ఉన్న 400ఏళ్ల క్రితం నాటి ద్రోణేశ్వర్ శివాలయంలో గర్బగుడిలో శివలింగంపై నిత్యం భారీ నీటి ధార పడుతూ భక్తులను ఆకర్షిస్తుంది. ఇది చూడటానికి భక్తులు తరలివస్తుంటారు. ఆ నీటి ధార ఎక్కడి నుంచి వస్తుందో మిస్టరీగా ఉండిపోయింది. ఆలయ నిర్మాణంలో నాటి శాస్త్ర, సాంకేతికతకు ఈ శివాలయం నిదర్శనంగా నిలిచింది. మహాభారతం కాలంలో గురు ద్రోణాచార్య ఈ ప్రదేశాన్ని సందర్శించి అక్కడ ఒక లింగాన్ని స్థాపించారని స్థల పురాణం.

అంతకుముందు ఈ ప్రదేశాన్నిరత్నేశ్వర్ అని పిలిచేవారని కథనం. ఒక విశాలమైన చెరువు మధ్యలో ఒక రత్నం లాంటి లింగం (శివుని చిహ్నం) ఉండేదని..అందుకే ఈ ప్రాంతాన్ని రత్నేశ్వర్ గా పిలిచేవారని…ఆ కాలంలో ఋషులు వశిష్ఠ, మార్కండేయలు ఇక్కడి మహాశివుడిని దర్శించుకున్నారని చెబుతారు. నేటికి ఈ శివాలయం ఒక అద్భుతమైన, పవిత్రమైన యాత్ర స్థలంగా కొనసాగుతుంది.

ఇవి కూడా చదవండి :

Jishnu Dev Varma : త్రీ ట్రిలియన్ డాలర్ల ఎకనామీగా తెలంగాణ పురోగమనం
NEOM Sky Stadium : వరల్డ్ వండర్…సౌదీ అరేబియా స్కై స్టేడియం