విధాత : ఇరాన్ తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్దం నేపథ్యంలో హర్మూజ్ జలసంధి మార్గంలో నౌకల రాకపోకలపై ఇరాన్ విధించిన ఆంక్షల ఫలితంగా ప్రపంచ దేశాలు ఇంధన కొరతను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో భారత్ లో సైతం ఎల్పీజీ గ్యాస్ , చమురు కొరతల సమస్యలు అధికమయ్యాయి. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం ఇరాన్ సహకారంతో భారత్ కు చెందిన శివాలిక్, నందాదేవి షిప్ లు 92ల మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో దేశానికి చేరుకోవడంతో కొంత మేర గ్యాస్ కొరత తీరింది. అదే సమయంలో జగ్ లడ్కీ నౌక 80,800 టన్నుల ముడి చమురుతో భారత్ చేరడం కూడా దేశీయ చమురు అవసరాలను తీర్చడంలో కీలకమైంది.
ఇప్పుడు జగ్ వసంత్, ఫైన్ గ్యాస్ అనే మరో రెండు ఎల్పీజీ నిల్వల నౌకలు హర్మూజ్ జలసంధి దాటి భారత్ కు పయనమయ్యేందుకు సిద్దమయ్యాయి. ప్రస్తుతం షార్జా దగ్గర ఆ రెండు నౌకలు ఎదురు చూస్తున్నాయి. ఇకపోతే ప్రస్తుతం గల్ఫ్ సముద్ర జలాల్లో యుద్ద పరిస్థితుల మధ్య భారత్ జెండాలతో కూడిన 22 నౌకలు, 600మందికి పైగా సిబ్బంది చిక్కుకుపోయి ఉన్నారు. ఆ నౌకలు ఒక్కొక్కటిగా భారత్ కు చేరుతాయని భారత్ విశ్వసిస్తుంది.
ఇవి కూడా చదవండి :
Jeevan Reddy| జీవన్ రెడ్డికి మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్ ల బుజ్జగింపులు!
Jagtial SI suicide| జగిత్యాల టూ టౌన్ ఎస్సై ఆత్మహత్య
