JNUSU Election Results 2025 | అధ్యక్ష రేసులో దూసుకుపోతున్న అరుణ కిరణం.. ఎవరీ అదితి మిశ్రా..
ఆదితి మిశ్రా విద్యార్థి రాజకీయాలు బీహెచ్‌యూలో ఆమె అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్‌లో చేరిన నాటి నుంచి మొదలయ్యాయి. మహిళా హాస్టళ్లలో పాక్షిక కర్ఫ్యూ విధింపునకు వ్యతిరేకంగా 2017 సెప్టెంబర్‌లో నిర్వహించిన ఆందోళనలో ఆమె పాల్గొన్నారు. ఈ ఆందోళనతో యూనిర్సిటీ అడ్మినిస్ట్రేషన్ దిగి వచ్చింది.
JNUSU Election Results 2025 | జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో అధ్యక్ష బరిలో దూసుకుపోతున్న వామపక్ష అభ్యర్థి అదితి మిశ్రా.. జేఎన్‌యూ సెంటర్ ఫర్ కంపారేటివ్ పాలిటిక్స్ అండ్ పొలిటకల్ థియరీలో పీహెచ్‌డీ స్కాలర్. దీర్ఘకాలంగా ఆమె విద్యార్థి రాజకీయాల్లో ఉన్నారు. బీహెచ్‌యూలో కర్ఫ్యూలకు వ్యతిరేకంగా మొదలుకుని.. ఫీజు పెంపుదల వ్యతిరేక పోరాటం, సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్నారు. యూపీలోని బనారస్‌కు చెందిన అదితి మిశ్రా.. ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్‌లో చురుకైన కార్యకర్త. లెఫ్ట్ యూనిటీ ప్యానెల్ తరఫున అధ్యక్ష బరిలో నిలిచారు. అనేక సంవత్సరాలుగా జేఎన్‌యూలో ప్రగతిశీల రాజకీయాల, సామాజిక న్యాయం, సమానత్వం ఉద్యమాల కొనసాగింపుగా చూస్తున్నారు.
ఆదితి మిశ్రా విద్యార్థి రాజకీయాలు బీహెచ్‌యూలో ఆమె అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్‌లో చేరిన నాటి నుంచి మొదలయ్యాయి. మహిళా హాస్టళ్లలో పాక్షిక కర్ఫ్యూ విధింపునకు వ్యతిరేకంగా 2017 సెప్టెంబర్‌లో నిర్వహించిన ఆందోళనలో ఆమె పాల్గొన్నారు. ఈ ఆందోళనతో యూనిర్సిటీ అడ్మినిస్ట్రేషన్ దిగి వచ్చింది. అనంతరం పాండిచ్చేరి యూనివర్సిటీలో చదివిన కాలంలో క్యాంపస్‌ను కాషాయీకరించే ప్రయత్నాలను వ్యతిరేకించారు. ఆర్బిటరీ ట్యూషన్ ఫీజుల పెంపునకు వ్యతిరేకంగా పోరాడారు. దేశవ్యాప్తంగా సీఏఏకు వ్యతరేకంగా సాగిన ఉద్యమాల్లోనూ ఆమె పాలుపంచుకున్నారు.
ప్రస్తుతం సెంటర్ ఫర్ కంపారేటివ్ పాలిటిక్స్ అండ్ పొలిటికల్ థియరీ(CCPPT)లో పీహెచ్‌డీ చేస్తున్నారు. ఆమె పరిశోధన ఉత్తరప్రదేశ్‌లో 2012 తర్వాతి నుంచి మహిళలపై లింగ వివక్ష ఆధారంగా సాగుతున్న హింస, మహిళల ప్రతిఘటనపై కేంద్రీకరించింది. సామాజిక న్యాయం, లింగ సమానత్వంపై ఆమె చిత్తశుద్ధిని ఆమె పరిశోధన చాటుతున్నది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram