Viral Video | ఎందుకంత నిర్లక్ష్యం..! నడిరోడ్డుపై కూతురి ప్రాణాలతో తండ్రి చెలగాటం..!! వీడియో
Viral Video | పిల్లలపై( Childrens ) ప్రేమ( Love ) ఉండాలి.. కానీ మితిమీరిన ప్రేమ ఉండొద్దు. కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాల్లో మాత్రమే పిల్లల పట్ల ప్రేమ, ఆప్యాయతలు చూపించాలి. అలా అని నిర్లక్ష్యం( Negligence ) కూడా ఏ మాత్రం పనికిరాదు.

Viral Video | పిల్లలపై( Childrens ) ప్రేమ( Love ) ఉండాలి.. కానీ మితిమీరిన ప్రేమ ఉండొద్దు. కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాల్లో మాత్రమే పిల్లల పట్ల ప్రేమ, ఆప్యాయతలు చూపించాలి. అలా అని నిర్లక్ష్యం( Negligence ) కూడా ఏ మాత్రం పనికిరాదు.. కానీ ఓ తండ్రి( Father ) తన కూతురి( Daughter ) పట్ల నిర్లక్ష్యం వహించాడు. నడిరోడ్డుపై ఆ చిన్నారి ప్రాణాలతో చెలగాటమాడాడు తండ్రి. ఈ వీడియో చూస్తే మీరు కూడా నిజమే కదా అంటారు.
అది మహారాష్ట్ర( Maharashtra ) రాజధాని ముంబై( Mumbai ) నగరం. ఛత్రపతి శంభాజీనగర్ రహదారి. వాహనాలు వేగంగా వెళ్తున్నాయి. ఓ తండ్రి తన కూతురితో కలిఇసి యాక్టివా( Activa )పై ప్రయాణిస్తున్నాడు. అయితే అతను డ్రైవింగ్( Driving ) చేయలేదు. ఆరేడు ఏండ్ల వయసున్న తన కూతురు డ్రైవింగ్ చేస్తుండగా, తండ్రి వెనుకాల హాయిగా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు. కనీసం ఆ చిన్నారి తలకు హెల్మెట్( Helmet ) కూడా లేదు.ఇక తాను ఏదో సాధించినట్లు ఆ తండ్రి ఫీలయ్యాడు. ఇతర వాహనదారులకు థమ్సప్ చూపిస్తూ సంబురపడిపోయాడు.
అయితే ఈ వీడియోపై నెటిజన్లు( Netizens ) మండిపడుతున్నారు. తమ పిల్లల పట్ల ఏ తండ్రి కూడా ఇంత నిర్లక్ష్యం వహించకూడదు. మైనర్ అయిన ఆ బాలికకు రైడింగ్( riding ) చేయమని ప్రోత్సహించడం నేరం. ఇలాంటి పేరెంట్స్( Parents ) వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని మండిపడుతున్నారు నెటిజన్లు.
View this post on Instagram