Lower Berth vs Upper Berth | రైలు ప్రయాణం చేసేటప్పుడు లోయర్ బెర్త్ మంచిదా? అప్పర్ బెర్త్ మంచిదా? అనే గందరగోళం చాలామందికి ఉంటుంది. అయినప్పటికీ ఆ కన్ఫ్యూజన్‌లో లోయర్ బెర్త్‌కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. నిజానికి రెండింటిలో ఏది బెటర్? ఏ బెర్త్ అయితే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
అప్పర్ బెర్త్ ప్రయోజనాలు
1. పూర్తి ప్రైవసీ
అప్పర్ బెర్త్‌లో పూర్తి ప్రైవసీ ఉంటుంది. ఇతర ప్రయాణికులు అటు ఇటు వెళ్తున్నప్పుడు ఎవరి దృష్టిలోనూ పడకుండా ఉంటాం. ఇతర ప్రయాణికులు తింటున్నా.. మాట్లాడుకుంటున్నా.. మనకంటూ ఎటువంటి డిస్ట్రబెన్స్ ఉండకుండా ఒక పర్సనల్ స్పేస్‌ను పొందవచ్చు. దీంతో ట్రైన్ జర్నీని రిలాక్స్‌డ్‌గా పూర్తి చేయవచ్చు. హాయిగా నిద్ర కూడా పోవచ్చు.
2. ప్రయాణికుల డిస్ట్రబెన్స్
లోయర్ బెర్త్‌లో ఉంటే పాసేజ్ లైట్లు, స్టేషన్లు వచ్చినప్పుడు లైట్ వెలుతురు ఇబ్బంది కలిగిస్తాయి. అలాగే పై బెర్త్, పక్క బెర్త్‌ల వాళ్లు మొబైల్ వాడుతుంటే.. ఆ స్క్రీన్ వెలుతురుతో డిస్ట్రబెన్స్ కారణంగా నిద్రకు అంతరాయం కలుగుతుంటుంది. అదే అప్పర్ బెర్త్ అయితే ఇటువంటి డిస్ట్రబెన్స్‌లు ఏవీ ఉండవు.
3. పగటిపూట కూడా విశ్రాంతి!
లోయర్ బెర్త్‌ను పగటిపూట ఇతర ప్రయాణికులతో షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. జర్నీలో అలసిపోయినా కూడా పగటి పూట పడుకునే అవకాశం ఉండదు. అదే అప్పర్ బెర్త్ అయితే మీ జర్నీ టైమ్‌లో ఎప్పుడు కావాలంటే అప్పుడు హాయిగా పడుకోవచ్చు. లాంగ్ జర్నీలకు వెళ్లేప్పుడు ఇదే పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు.
4. శబ్దాలు తక్కువ!
రైలు జర్నీలో ఉన్నప్పుడు ప్రయాణికులు అటు ఇటు వెళ్తుంటారు. టికెట్ చెకింగ్‌కు టీటీలు వస్తుంటారు. అలాగే ఛాయ్, సమోసా, బిస్కెట్స్ అంటూ వెండర్స్ వస్తుంటారు. కింద బెర్త్‌లో ఉంటే వాళ్లందరూ వచ్చినప్పుడు కొంత అసౌకర్యంగా ఉంటుంది. అదే అప్పర్ బెర్త్‌లో ఉంటే అలాంటి శబ్దాలు తక్కువగా వినిపిస్తాయి. డిస్ట్రబెన్స్ ఉండదు కాబట్టి ఎలాంటి చింత లేకుండా హాయిగా ఉండొచ్చు.
5. నైట్ టైమ్ హోటల్‌లో పడుకున్నట్లే!
అప్పర్ బెర్త్ అంటే చిన్న కంఫర్ట్ జోన్‌లా ఉంటుంది. నైట్ టైమ్‌లో తక్కువ లైట్, తక్కువ శబ్దాలు ఉంటాయి. ప్రయాణికుల రాకపోకలు కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి ఎలాంటి డిస్ట్రబెన్స్ లేకుండా హాయిగా పడుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే చిన్న సైజ్ హోటల్‌లో పడుకున్నట్లుగానే ప్రశాంతంగా ఉంటుంది.
లోయర్ బెర్త్ ప్రయోజనాలు
1. సౌకర్యం
లోయర్ బెర్త్ అయితే తరచూ ఎక్కడం దిగడం వంటి ఇబ్బంది ఉండదు. పెద్దవారికి, చిన్న పిల్లలకు, మోకాళ్ల నొప్పులు ఉన్న వాళ్లకు సౌకర్యంగా ఉంటుంది. ఎలాంటి కష్టం లేకుండా వెంటనే పడుకోవచ్చు.
2. రాకపోకలకు ఈజీ!
రాత్రి సమయంలో వాష్‌రూమ్‌కు వెళ్లాలన్నా.. నీళ్లు తాగాలన్నా.. బ్యాగ్ తీసుకోవాలన్నా ఇబ్బంది ఉండదు. ఈజీగా ఉంటుంది. అదే అప్పర్ బెర్త్ అయితే ప్రతిసారి కిందకు దిగాల్సి వస్తుంది.
3. వృద్ధులకు సేఫ్!
వృద్ధులు, పిల్లలతో వెళ్తున్నప్పుడు లోయర్ బెర్త్ కంఫర్ట్‌గా ఉంటుంది. కూర్చోవడానికి అయినా.. పడుకోవడానికైనా అనుకూలంగా ఉంటుంది. అదే అప్పర్ బెర్త్ అయితే ఎక్కేప్పుడు, దిగేప్పుడు పడిపోతారనే దిగులు ఉంటుంది. కానీ లోయర్ బెర్త్‌లో అలాంటి ప్రమాదమేమీ ఉండదు కాబట్టి ఫ్యామిలీ ట్రావెల్స్‌కు ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.
4. లగేజీ భద్రత
లోయర్ బెర్త్ అయితే మన లగేజీ మన కళ్ల ముందే ఉంటుంది. చేతికి అందినట్లుగానే ఉంటాయి కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు చెక్ చేసుకోవచ్చు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో మన లగేజీ సురక్షితంగా ఉంటుంది.
5. స్టేషన్ల వద్ద దిగడానికి కంఫర్ట్
మన స్టేషన్ రాత్రి వచ్చేట్లు ఉంటే లోయర్ బెర్త్ అయితే సులభంగా దిగొచ్చు. ఇతరులను లేపాల్సిన అవసరం ఉండదు. దిగాల్సిన స్టేషన్ మిస్సవుతామనే టెన్షన్ కూడా ఉండదు.
ఏది బెటర్?
ఫ్రీక్వెంట్ ట్రావెలర్స్ అనుభవం ప్రకారం చూస్తే.. ప్రశాంతంగా, ఎటువంటి అంతరాయం లేకుండా డీప్ స్లీప్ కావాలంటే అప్పర్ బెర్త్ బెస్ట్. అదే కంఫర్ట్, కన్వీనియన్స్ కావాలంటే మాత్రం లోయర్ బెర్త్ బెస్ట్ ఆప్షన్. ఇంకా చెప్పాలంటే యూత్‌కు, సింగిల్ ట్రావెలర్స్‌కు అప్పర్ బెర్త్.. ఫ్యామిలీ, సీనియర్ సిటిజన్స్‌కు లోయర్ బెర్త్ మంచిది. కాబట్టి మన ప్రయాణాన్ని బట్టి బెర్త్ ఎంచుకుంటే జర్నీ సాఫీగా సాగుతుంది.
Read More:
అందాల పోటీల్లో స్టేజీపైనే పళ్లు ఊడిపోయినా.. కూల్‌గా హ్యాండిల్ చేసిన బ్యూటీ క్వీన్.. వీడియో వైరల్
బంపరాఫర్.. గ్యాస్ సిలిండర్ ఇవ్వండి.. నెల రోజులు బిర్యానీ ఫ్రీగా తినండి.. !
