Viral Video | అందాల పోటీల్లో స్టేజీపైనే పళ్లు ఊడిపోయినా.. కూల్‌గా హ్యాండిల్ చేసిన బ్యూటీ క్వీన్!

Viral Video | మిస్ గ్రాండ్ థాయిలాండ్ పోటీల్లో ఓ కంటెస్టెంట్ చేసిన పని ఇప్పుడు వైరల్‌గా మారింది. ప్రిలిమినరీ రౌండ్‌లో పాల్గొన్న ఓ కంటెస్టెంట్.. స్టేజిపైనే ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంది. అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో ముందుకుసాగింది. ఆత్మవిశ్వాసంతో ర్యాంప్ వాక్‌ను పూర్తి చేసి అందరితో శభాష్ అనిపించుకుంది.

Viral Video | అందాల పోటీల్లో స్టేజీపైనే పళ్లు ఊడిపోయినా.. కూల్‌గా హ్యాండిల్ చేసిన బ్యూటీ క్వీన్!

Viral Video | మిస్ గ్రాండ్ థాయిలాండ్ (Miss Grand Thailand) పోటీల్లో ఓ కంటెస్టెంట్ చేసిన పని ఇప్పుడు వైరల్‌గా మారింది. ప్రిలిమినరీ రౌండ్‌లో పాల్గొన్న ఓ కంటెస్టెంట్.. స్టేజిపైనే ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంది. అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో ముందుకుసాగింది. ఆత్మవిశ్వాసంతో ర్యాంప్ వాక్‌ను పూర్తి చేసి అందరితో శభాష్ అనిపించుకుంది.

ఇంతకీ ఏమైంది?

మిస్ గ్రాండ్ థాయిలాండ్ పోటీల్లో భాగంగా మార్చి 25వ తేదీన ప్రిలిమనరీ రౌండ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమోల్వాన్ చనాగో (Kamolwan Chanago) అనే మోడల్ కూడా ర్యాంప్ వాక్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా స్టేజ్ మీదకు వచ్చిన ఆమె.. తనను తాను పరిచయం చేసుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా ఆమె కట్టుడు పళ్లు ఊడిపోయాయి. అలాంటి సమయంలో ఎవరైనా కాస్త కంగారు పడిపోతారు. అంతమంది ముందు పరువు పోయిందని బాధపడుతూ ఉండిపోతారు. కానీ కమోల్వాన్ మాత్రం ఏ మాత్రం అధైర్యపడలేదు. ఏ మాత్రం టెన్షన్ పడకుండా వెంటనే తన కట్టుడు పళ్లను సరిచేసుకుంది.

వీడియో వైరల్

ఏమీ జరగనట్టుగానే చిరునవ్వుతో తన ర్యాంప్ వాక్‌ను కంటిన్యూ చేసింది. స్టేజ్ చివరికి వెళ్లి ప్రేక్షకులను చూస్తూ కొద్దిసేపు పోజ్ కూడా ఇచ్చింది. ఆ సమయంలో ఆమె ఒంపులు, అందం కంటే కూడా ఆత్మవిశ్వాసం ప్రేక్షకులను విశేష ఆకట్టుకుంది. ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తూ స్టేజ్ కింద ఉన్న ప్రేక్షకులు కరతాళధ్వనులతో ఉత్సాహపరిచారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

 

నిజమైన అందం అంటే అదే..!

సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోను చూసి కొంతమంది ట్రోల్స్ చేస్తున్నప్పటికీ.. చాలామంది ఆమె ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకుంటున్నారు. ఫ్లాలెస్ రికవరీ.. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ధైర్యంగా నిలబడటం గొప్ప విషయమని ప్రశంసిస్తున్నారు. అందం అంటే రూపమే కాదు.. ఆత్మవిశ్వాసం కూడా అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. నిజమైన అందం చూడటంలో కాదు.. కష్ట సమయాల్లో మనల్ని మనం నిలబెట్టుకోవడంలో ఉంటుందని చెప్పుకొస్తున్నారు.

 

 

Read More:

తొలిసారి భారత్‌లో కనిపించిన రెండు సర్పజాతులు.. ఇవీ వాటి ప్రత్యేకతలు

నా కడుపులో విరాట్ కోహ్లీ బిడ్డను మోస్తున్నా..యువతి హల్చల్