Maharashtra minister viral video| ట్రాన్స్‌జెండర్‌తో మంత్రి… వీడియో వైరల్
మహారాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలన శాఖ మంత్రి, ఎన్‌సీపీ నేత నరహరి జిల్వాల్ తన అధికారిక నివాసంలోని బెడ్‌రూమ్ లో ట్రాన్స్‌జెండర్‌తో సన్నిహితంగా ఉన్న వీడియో వైరల్ కావడం ఆ రాష్ట్ర రాజకీయాల్లో దూమారం రేపింది. అయితే ఇదంతా హనీ ట్రాప్ వ్యవహారంగా మంత్రి కొట్టిపారేస్తున్నారు.
విధాత : అధికారిక నివాసంలోని బెడ్ రూమ్ లో ఓ మంత్రి ట్రాన్స్ జెండర్ తో సన్నిహితంగా ఉన్న వీడియో నెట్టింటా హల్చల్ చేస్తుంది. మహారాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలన శాఖ మంత్రి, ఎన్‌సీపీ నేత నరహరి జిల్వాల్ తన అధికారిక నివాసంలోని బెడ్‌రూమ్ లో ట్రాన్స్‌జెండర్‌తో సన్నిహితంగా ఉన్న వీడియో వైరల్ కావడం ఆ రాష్ట్ర రాజకీయాల్లో దూమారం రేపింది.
వీడియోలో మద్యం సీసాలు కూడా కనిపించడం, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి కూడా ప్రభుత్వ భవనాన్ని ఇలాంటి అసాంఘిక పనులకు ఎలా ఉపయోగిస్తారని విపక్ష నేతలు మండిపడుతున్నారు. మంత్రి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. బ్లాక్‌మెయిల్ కోసం వీడియో రిలీజ్ చేశారని మంత్రి కొట్టిపారేస్తున్నారు.
అయితే ఆ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పవన్ యాదవ్ అని తెలుస్తోంది. రాష్ట్రంలో మొదటి ట్రాన్స్‌జెండర్ లాయర్‌గా అతను గుర్తింపు పొందినట్లు సమాచారం. ఈ వీడియో బయట పడటం వెనుక హనీట్రాప్, బ్లాక్‌మెయిల్ కోణం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పవన్ యాదవ్ సోదరుడు రవి యాదవ్ దీనికి సంబంధించి కీలక ఆరోపణలు చేశాడు. పవన్ గతంలో కూడా పలువురు ప్రముఖులను బెదిరించి వసూళ్లకు పాల్పడేవాడని చెప్పాడు. ఇప్పటికే ముంబైలో ఇతనిపై పలు కేసులు నమోదైనట్లు తెలిపాడు. ఇది కేవలం నరహరి జిర్వాల్‌ను మాత్రమే కాక మరికొందరు కీలక మంత్రులను టార్గెట్ చేసుకుని చేసిన కుట్రగా పేర్కొనడంతో వివాదం మరో మలుపు తిరిగింది. ఒకవేళ ఇది హనీట్రాప్ ముఠా పనే అయినట్లయితే.. ఇంకా ఎంతమంది ప్రముఖులు ఈ వ్యవహారంలో ఇరుక్కున్నారనే దానిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి.
चो दना ही था तो चो द देते अपनी मोहब्बत को, यूँ वीडियो बनाकर हमारी गान जलाने की ज़रूरत क्या थी! #Maharashtra #Minister #NarhariZirwal pic.twitter.com/OD0mIyt6j1
— Rishi Dhiman (@rishidhiman2808) March 26, 2026
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram