ఎన్నికల ప్రచారాల్లో రాజకీయ నాయకులు కొన్నిసార్లు మాట జారుతూ ఉంటారు. అవి కొన్ని సార్లు వివాదస్పమవడం లేకపోతే ఇంటర్నెట్‌లో వైరల్ అవడమో జరుగుతూ ఉంటాయి.

విధాత: ఎన్నికల ప్రచారాల్లో రాజకీయ నాయకులు కొన్నిసార్లు మాట జారుతూ ఉంటారు. అవి కొన్ని సార్లు వివాదస్పమవడం లేకపోతే ఇంటర్నెట్‌లో వైరల్ అవడమో జరుగుతూ ఉంటాయి. తాజాగా కాంగ్రెస్ (Congress) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge).. రాహుల్ గాంధీ (Rahul Gandhi) పై చేసిన వ్యాఖ్య ఒకటి అలానే వైరల్ గా మారింది.
రాజస్థాన్ ఎన్నికల సందర్భంగా అక్కడి ప్రచారంలో పాల్గొంటున్న ఖర్గే.. సోమవారం ఒక సభలో మాట్లాడుతూ రాహుల్‌గాంధీ లాంటి నాయకులు దేశం కోసం తమ ప్రాణాలు విడిచారు అని వ్యాఖ్యానించారు. రాజీవ్ గాంధీ గురించి చెప్పడం ఆయన ఉద్దేశం కాగా.. పొరపాటున రాహుల్ గాంధీ అని అనేశారు.
ये कब हुआ? pic.twitter.com/OCCR65Q1qc
— BJP (@BJP4India) November 20, 2023
దీంతో వెంటనే పక్కనున్న నాయకులు ఖర్గేను అలెర్ట్ చేశారు. దీంతో తప్పు గ్రహించిన కాంగ్రెస్ అధ్యక్షుడు క్షమాపణలు చెబుతూ.. తాను చెప్పాలనుకున్నది రాజీవ్ గాంధీ గురించి అని వివరించారు. రాజీవ్ గాంధీ లాంటి కాంగ్రెస్ నేతలు దేశం కోసం ప్రాణాలిస్తే.. బీజేపీ నాయకులు ప్రాణాలు తీస్తున్నారని విమర్శలను కొనసాగించారు. అయితే ఈ అవకాశాన్ని బీజేపీ ఐటీ టీం వదిలిపెట్టలేదు.
ఖర్గే వ్యాఖ్యపై పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నెట్టింట్లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇదెప్పుడు జరిగింది అంటూ బీజేపీ అధికారిక ఎక్స్ హ్యాండిల్ వ్యంగ్యంగా పోస్ట్ చేసింది. ఇలాంటి పెద్ద నేను ఎలా మిస్ అయ్యాను అంటూ ఆ పార్టీ నేత చారు ప్రగ్యా ప్రశ్నించారు. ఖర్గేకు మాత్రమే ఆ విషయం తెలుసని మరొకరు వ్యాఖ్యానించారు. ఇలా ఎక్స్‌లో ఖర్గే వ్యాఖ్యపై పోస్ట్‌ల వర్షం కురుస్తోంది.
