ఓ యువకుడు తనను కాటు చేసిన పామును కొరికి చంపేసి ఆసుపత్రికి వెళ్లిన ఘటన వైరల్ గా మారింది. పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లాలో ఫరూఖ్ మోమిన్ అనే యువకుడిని పాము కాటేసింది. తనను కాటు వేసిన పాములపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోపిన మోమిన్ అదే పామును పట్టుకుని దాని తలను కొరికి చంపేశాడు.
చికిత్స కోసం పామును చేతిలో పట్టుకుని ఆసుపత్రికి బయలుదేరాడు. ఓ చెతిలో పామును పట్టుకుని తనకు ఆసుపత్రికి వెళ్లేందుకు లిఫ్టు కావాలంటూ వాహనదారులను అభ్యర్థించాడు. చేతిలో పాముతో రోడ్డుపైకి వచ్చినా అతడి వాలకం చూసిన వాహనదారులు భయంతో ఎవరూ లిఫ్ట్ ఇవ్వలేదు. దీంతో పాము విషం తనను మెల్లగా తూలిపోయేలా చేస్తున్నప్పటికి …అలాగే 4 కిలోమీటర్లు నడిచి ఆసుపత్రికి చేరుకున్నాడు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
పశ్చిమ బెంగాల్లో విచిత్ర ఘటన
తనను కాటేసిన పాముపై పగ తీర్చుకున్న యువకుడు
మాల్దా జిల్లాలో ఫరూఖ్ మోమిన్ అనే యువకుడిని కాటేసిన పాము.. ఆగ్రహంతో దాని తల కొరికి చంపేసిన బాధితుడు
చికిత్స కోసం చనిపోయిన పామును చేతిలో పట్టుకుని రోడ్డుపైకి వచ్చిన యువకుడు.. భయంతో లిఫ్ట్ ఇవ్వని వాహనదారులు… pic.twitter.com/0sibQMJm4j
— Telugu Stride (@TeluguStride) July 14, 2026
