కిడ్నాప్‌ కేసులో కర్ణాటక మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ అరెస్ట్‌

కిడ్నాప్‌ కేసులో కర్ణాటక మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణను కర్ణాటక స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ (సిట్‌) శనివారం అదుపులోకి తీసుకున్నది.

కిడ్నాప్‌ కేసులో కర్ణాటక మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ అరెస్ట్‌

బెంగళూరు : కిడ్నాప్‌ కేసులో కర్ణాటక మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణను కర్ణాటక స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ (సిట్‌) శనివారం అదుపులోకి తీసుకున్నది. ఆయన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను స్థానిక కోర్టు తిరస్కరించిన అనంతరం సిట్‌ అధికారులను ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అంతకు ముందు రేవణ్ణపై సిట్‌ అధికారులు లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. రేవణ్ణ ఇంటిలో మెయిడ్‌గా పనిచేసిన మహిళ ఒకరు గత ఆదివారం రేవణ్ణ, ఆయన కుమారుడు ప్రజ్వల్‌పై హోళెనర్సిపుర పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు మేరకు వారిద్దరిపై తొలిసారి కేసు నమోదైంది. మరోవైపు గురువారం రాత్రి మైసూరులో ఒక మహిళ తనను కిడ్నాప్‌ చేసి, లైంగికదాడికి పాల్పడ్డారని చేసిన ఫిర్యాదు ఆధారంగా రేవణ్ణ, ఆయన అనుచరుడు సతీశ్‌ బబన్నపై రెండో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం హసన్‌లోని జేడీఎస్‌ నేత ప్రజ్వల్‌ రేవణ్ణ ఇంటికి స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ చేరుకుంది. హెచ్‌డీ రేవణ్ణ, ఆయన కుమారుడు ప్రజ్వల్‌కు కర్ణాటక హోం మంత్రి జీ పరమేశ్వరకు కర్ణాటక హోం శాఖ రెండో లుకౌట్‌ నోటీసు జారీ చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకున్నది. రేవణ్ణకు, ఆయన కుమారుడు ప్రజల్వ్‌కు ఇప్పటికే లుకౌట్‌ నోటీసు జారీ అయింది.

రేవణ్ణ కూడా విదేశాలకు వెళ్లే ప్రణాళికల్లో ఉంటారనే ఉద్దేశంతో వీటిని జారీ చేశాం’ అని హోం మంత్రి పరమేశ్వర మీడియాకు చెప్పారు. సిట్‌ దర్యాప్తునకు హాజరయ్యేందుకు రేవణ్ణకు శనివారం సాయంత్రం వరకూ సమయం ఉన్నది’ అని ఆయన తెలిపారు. ఈలోపు ఆయన మైసూరు కిడ్నాప్‌ కేసులో ఇప్పటికే బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. ఈ బెయిల్‌ను తిరస్కరించడంతో రేవణ్ణను సిట్‌ అధికారులు అరెస్టు చేశారు.