ఒడిస్సా తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా … మోహన్ చరణ్ మాఝీ ప్రమాణస్వీకారం

ఒడిస్సా తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ బుధవారం సాయంత్రంప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రులుగా కనక వర్దన్ సింహ్ దేవ్, ప్రవటి పరిదా ప్రమాణ స్వీకారం చేశారు.

ఒడిస్సా తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా … మోహన్ చరణ్ మాఝీ ప్రమాణస్వీకారం

విధాత : ఒడిస్సా తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ బుధవారం సాయంత్రంప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రులుగా కనక వర్దన్ సింహ్ దేవ్, ప్రవటి పరిదా ప్రమాణ స్వీకారం చేశారు. ఒడిస్సా గవర్నర్ రఘుబీర్ దాస్ వారితో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. భువనేశ్వర్‌లోని జనతా మైదాన్‌లో అట్టహాసంగా జరిగింది. కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు సహా 30,000 మంది ప్రజానీకం పాల్గొన్నారు. మాఝీ ఆహ్వానం మేరకు బిజూ జనతాదళ్ చీఫ్ నవీన్ పట్నాయక్ సైతం హాజరయ్యారు. ఇటీవల జరిగిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో 147 స్థానాలకు గాను 78 సీట్లు బీజేపీ గెలుచుకోవడంతో 24 ఏళ్ల బీజేడీ పాలనకు తెరపడింది

సీఎం మోహన్ చరణ్ మాఝీ ప్రమాణస్వీకారానికి కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, అశ్విని వైభవ్, నితిన్ గడ్కరి, జేపీ నడ్డా, అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, హర్యానా సీఎం నయబ్ సింగి సైని, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయి, త్రిపుర సీఎం మానిక్ సహా, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు హాజరయ్యారు. .