Graveyard | 20 ఏండ్లుగా స్మశాన వాటికలోనే జీవిస్తున్న మహిళ..! ఆమెకు అదే శాశ్వత నిలయం..!!
Graveyard | స్మశాన వాటికలు సమాధులకు నిలయాలు. చనిపోయిన ప్రతి ఒక్కరిని స్మశాన వాటికల్లో పూడ్చి పెడుతుంటారు. అలాంటి స్మశాన వాటిక ఆమెకు శాశ్వత నిలయంగా మారింది. తన ఇద్దరు పిల్లలతో కలిసి గత 20 ఏండ్లుగా స్మశాన వాటికలో సమాధుల మధ్యే నివసిస్తోంది ఆమె. మరి ఆమె గురించి తెలుసుకోవాలంటే కర్ణాటకలోని మైసూర్ వెళ్లక తప్పదు.

స్మశాన వాటికలు అంటేనే భయమేస్తోంది. ఎందుకంటే అక్కడ దెయ్యాలు తిరుగుతాయని. మనషులను భయపెట్టిస్తాయని. కానీ మైసూర్‌కు చెందిన నీలమ్మ అనే మహిళ మాత్రం తన భర్త చనిపోయిన తర్వాత స్మశాన వాటికను తన ఇంటిగా మార్చుకుంది. ఈ స్మశాన వాటిక మైసూర్‌లోని విద్యారణ్యపురంలో ఉంది. ఇక ఆ స్మశాన వాటిక బాధ్యతలన్నీ నీలమ్మనే చూసుకుంటుంది. స్మశాన వాటికలో మగాళ్లు చేసే పనులన్నీ ఆమె ఒక్కరే చేస్తున్నారు. సమాధులు తవ్వడం నుంచి మొదలుకుంటే.. శవాలను పూడ్చి పెట్టే వరకు అన్నీ తానై వ్యవహరిస్తుంది.
అయితే తన భర్త చనిపోయిన తర్వాత స్మశాన వాటికలోనే ఉండాలని ఆమె నిర్ణయించుకున్నారు. దాంతో గత 20 ఏండ్ల నుంచి తన ఇద్దరు పిల్లలతో కలిసి సమాధుల మధ్యే నివాసం ఉంటోంది. తాను మానసికంగా బాగాలేనప్పుడు సమాధులన్నింటినీ శుభ్రపరుస్తుంటుంది. ఇలా చేయడంలో ఆమె ఆధ్యాత్మిక వాతావరణంలోకి వెళ్లిపోతుందట. లింగాయత్ కమ్యూనిటీకి చెందిన నీలమ్మకు 2005లో సమాధులు తవ్వితే రూ. 500 ఇచ్చేవారు. ఇప్పుడు రూ. 1000 ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. ఒక్క సమాధి తవ్వడానికి సుమారు మూడు గంటల సమయం పడుతుందని నీలమ్మ పేర్కొన్నారు. తాను ఈ పనులు చేస్తున్నందుకు లింగాయత్ కమ్యూనిటీ నుంచి అనేక సన్మానాలు, ప్రశంసలు అందుకున్నానని గుర్తు చేశారు.