NDA : ఎన్డీఏ నెక్ట్స్ టార్గెట్.. బెంగాల్
బీహార్ విజయానంతరం ఎన్డీఏ తదుపరి టార్గెట్‌గా పశ్చిమ బెంగాల్‌పై దృష్టి పెట్టింది. 2026 ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది.
విధాత : బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో అంచనాలకు మించి ఘన విజయం సాధించిన ఎన్డీఏ కూటమి తమ తదుపరి టార్గెట్ గా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అధికారంలోకి రావడంపై ఫోకస్ పెట్టనుంది. వచ్చే ఏడాది 2026లో పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ప్రధానంగా మోదీకి వ్యతిరేకంగా బలమైన గళం వినిపిస్తున్న మమత, స్టాలిన్‌లు పాలిస్తున్న బెంగాల్ లో సొంతంగా, తమిళనాడులో కూటమిగా అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. అస్సామ్ లో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు పావులు కదుపుతుంది. ఎన్నికల సన్నాహాల్లో భాగంగా ఆ రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియను ఎన్నికల సంఘం చేపట్టబోతుంది. ఎస్ఐఆర్ త్వరగా పూర్తి చేసి ఆ రాష్ట్రాలలో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సిద్దమవుతుంది.
10శాతం ఓట్లు సాధిస్తేనే..
ప్రధానంగా బీజేపీ పశ్చిమ బెంగాల్ లో అధికారంలోకి రావాలని చూస్తుంది. పశ్చిమ బెంగాల్‌లో వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 77 స్థానాలు, 2024 లోక్‌సభ ఎన్నికల్లో 14 సీట్లలో విజయం సాధించింది. 2019 లోక్ సభ ఎన్నికల నుంచి కూడా బీజేపీ ఓటింగ్ శాతం 30-40శాతంగా ఉంటోంది. బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు ఇంకా 10శాతం ఓట్లు అవసరమని..మమత ప్రభుత్వంపై వ్యతిరేకత, ప్రధాని మోదీ పాలనపై పెరిగిన విశ్వాసంతో 2026 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తాం అని బీజేపీ నాయకత్వం ధీమా వ్యక్తం చేస్తుంది.
బీహార్ మాదే..ఇక బెంగాల్ వంతు : కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్
బీహార్‌లో అవినీతి, దోపిడీ,అరాకచక ప్రభుత్వానికి చోటు లేదని ప్రజలు నిరూపించారని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ప్రశంసించారు. బీహార్ లో ఎన్డీఏ కూటిమి గెలుపు అభివృద్ధి సాధించిన విజయం అన్నారు. బీహార్‌ను గెల్చుకున్నాం అని.. ఇప్పుడిక బెంగాల్ వంతు అంటూ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సవాల్ విసిరారు. బెంగాల్ లో ఉన్నది కూడా అరాచక ప్రభుత్వమని, అక్కడ కూడా మమతకు ఓటమి తప్పదన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram