కేంద్రం చెప్పినట్లుగానే ఆలర్ట్ మేసేజ్ టోన్ లు

కేంద్ర ప్రభుత్వ చెప్పినట్లుగానే శనివారం ఉదయం 11:45కి అందరి ఫోన్లు అలెర్ట్ మెసేజ్ టోన్ తో మోగాయి. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ దేశవ్యాప్తంగా అత్యవసర హెచ్చరికల కోసం ‘సెల్ బ్రాడ్‌కాస్ట్ అలర్ట్ సిస్టమ్’ ట్రయల్‌ను ఈ వారం నిర్వహిస్తోంది. దీనిలో భాగంగానే ఈరోజు ఫోన్లకు అలెర్ట్ మెసేజ్ పంపారు.

భూకంపాలు, తుఫాన్లు, సునామీ వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజల మొబైళ్లకు వేగంగా అలర్ట్ పంపించడానికి అభివృద్ధి చేసిన స్వదేశీ టెక్నాలజీని పరీక్షించడంలో భాగంగానే ఈ ఫ్లాష్ మెసేజ్‌లు పంపించామని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) అధికారులుతెలిపారు. ఇది ఎలాంటి ప్రమాద సూచిక కాదని.. పరీక్షల్లో భాగమేనని స్పష్టం చేశారు. ఇంగ్లీష్, హిందీతో పాటు పలు ప్రాంతీయ భాషల్లో ఈ మెసెజ్‌ అలర్ట్‌లను పంపించారు.

సెల్ బ్రాడ్‌కాస్ట్ టెక్నాలజీతో ఒకేసారి నిర్దిష్ట ప్రాంతంలోని అన్ని మొబైల్ ఫోన్లకు మెసేజ్‌లను పంపిస్తుంది. దీంతో సునామీ, భూకంపాలు, గ్యాస్ లీక్ వంటి అత్యవసర సమయాల్లో చాలా వేగంగా హెచ్చరికలు అందుతాయి. తద్వారా అత్యవసర ప్రతికూల పరిస్థితులలో నష్ట నివారణ, సహాయక చర్యలను మెరుగ్గా నిర్వహించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి :

NEET UG | రేపే నీట్ యూజీ ప‌రీక్ష‌.. అర గంట ముందే ప‌రీక్షా కేంద్రానికి చేరుకోవాలి..
ఉద్యోగం రాక  అమెరికాలో ఆంధ్రా యువకుడి ఆత్మహత్య.. మృతదేహం కోసం కుటుంబం ఎదురుచూపులు