మిజోరం పోలింగ్.. మధ్యాహ్నం 1 వరకు 53 శాతం ఓటింగ్

విధాత: మిజోరం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మంగళవారం ప్రశాంతంగా జరుగుతున్నది. పోలింగ్ ప్రారంభమైన మొదటి నాలుగు గంటల్లో 8.57 లక్షల మంది ఓటర్లలో 33 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని అధికారులు తెలిపారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్నది.
ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం మధ్యాహ్నం 1 గంటల వరకు 53 శాతం ఓటింగ్ నమోదైంది. మిజోరం ఎన్నికలలో 174 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 2018లో 40 స్థానాలకు గాను 26 స్థానాలను గెలుచుకున్న మిజో నేషనల్ ఫ్రంట్ ఆధీనంలోకి వచ్చింది. కాంగ్రెస్‌కు ఐదు సీట్లు రాగా, బీజేపీకి ఒక్క సీట్లు మాత్రమే వచ్చాయి.
ఛత్తీస్‌గఢ్‌లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మంగళవారం పటిష్ట భద్రత మధ్య ప్రారంభమైంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలోని మొత్తం ఏడు జిల్లాల్లో ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. ఛత్తీస్‌గఢ్‌లో ఉదయం 11 గంటల వరకు 26.97 శాతం పోలింగ్ నమోదైంది.