అతనో శృంగార పురుషుడు.. 2023లో 9,940 కండోమ్స్ ఆర్డర్
ఆన్‌లైన్ షాపింగ్ అందుబాటులోకి వచ్చాక వినియోగదారులెవరూ దుకాణాల వద్దకు వెళ్లేందుకు ఆసక్తి చూపించడంలేదు. మానవునికి కావాల్సిన సామాగ్రి ఏదైనా ఇట్లా ఆర్డర్

న్యూఢిల్లీ : ఆన్‌లైన్ షాపింగ్ అందుబాటులోకి వచ్చాక వినియోగదారులెవరూ దుకాణాల వద్దకు వెళ్లేందుకు ఆసక్తి చూపించడంలేదు. మానవునికి కావాల్సిన సామాగ్రి ఏదైనా ఇట్లా ఆర్డర్ చేస్తే పట్టుమని పదినిమిషాల్లో గుమ్ముం ముందు ఉంటుంది. దీంతో గడప దాటకుండానే ఏదైనా కొనేస్తున్నారు. ఆన్‌లైన్ షాపింగ్‌ను ఒక్కొక్కరూ ఒక్కో విధంగా వాడుకుంటున్నారు. అయితే బ్లింకిట్ అనే ఆన్‌లైన్ షాపింగ్ యాప్ గత సంవత్సరం వారి సేవలను అత్యంత ఎక్కువగా వాడుకున్న వారి వివరాలు తెలిపింది. ఓ వ్యక్తి మాత్రం 2023 ఏడాదంతా రొమాంటిక్‌లో మునిగిపోయాడు. శృంగార జీవితాన్ని హాయిగా ఎంజాయ్ చేశాడు.
వీటికి సాక్ష్యం అతను ఆర్డర్ చేసిన కండోమ్స్ సంఖ్యను చూస్తే అర్థమవుతోంది. 2023లో 9,940 కండోమ్స్ ఆర్డర్ చేసి శృంగార పురుషుడిగా నిలిచాడు. దక్షిణ ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి బ్లింకిట్ అనే యాప్ ద్వారా కండోమ్స్ ఆర్డర్ చేసినట్లు ఆ యాప్ అధినేత అల్బిందర్ ధిండ్షా వెల్లడించారు. అంటే రోజుకు అతను 27 కండోమ్స్ వినియోగించినట్లు తెలుస్తోంది. అంటే గంటకు ఒక కండోమ్ వినియోగించినట్లు పేర్కొన్నారు.
కండోమ్స్‌తో పాటు పార్టీ స్మార్ట్ టాబ్లెట్‌ల అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగినట్లు తెలిపారు. మొత్తంగా 30,02,080 టాబ్లెట్లు ఆర్డర్ చేసినట్లు పేర్కొన్నారు. మరో వ్యక్తి నెల రోజుల వ్యవధిలోనే 38 అండర్ వేర్స్‌ను ఆర్డర్ చేశాడు. 80,267 బాటిళ్ల గంగాజలం, 65,793 లైటర్స్ కూడా ఆర్డర్ చేసినట్లు పేర్కొన్నారు. సాఫ్ట్ డ్రింక్స్ కూడా కొనుగోళ్లు జరిగాయన్నారు.