PM Dhan-Dhaanya Krishi Yojana | పీఎం ధన్-ధాన్య కృషి యోజన పథకంలో తెలంగాణ జిల్లాలు

వ్యవసాయ ఉత్పాదకత పెంపు, నీటిపారుదల సౌకర్యాల మెరుగుదల, రైతులకు సులభతర రుణాల కల్పన మొదలగు అంశాలతో రూపొందించిన ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకం ప్రారంభమైంది.

  • By: Tech |    national |    Published on : Oct 12, 2025 2:00 AM IST
PM Dhan-Dhaanya Krishi Yojana | పీఎం ధన్-ధాన్య కృషి యోజన పథకంలో తెలంగాణ జిల్లాలు PM Dhan-Dhaanya Krishi Yojana
  • పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకo ప్రారంభం
  • తెలంగాణ నుంచి ఎంపికైన జిల్లాలో జనగామ

జనగామ అక్టోబర్ 11 (విధాత): వ్యవసాయ ఉత్పాదకత పెంపు, నీటిపారుదల సౌకర్యాల మెరుగుదల, రైతులకు సులభతర రుణాల కల్పన మొదలగు అంశాలతో రూపొందించిన ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకం ప్రారంభమైంది.

దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన 100 జిల్లాల్లో జనగామ జిల్లా కూడా ఉన్నది. ఈ పథకాన్ని అమలు చేసేందుకు పీఎం మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ఈ పథకాన్ని శనివారం ప్రారంభించారు. ఈ ప్రారంభ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని.. కలెక్టరేట్ లోని కాన్ఫెరెన్స్ హాల్‌ల్లో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, జనగాం శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, వ్యవసాయ, అనుబంధ శాఖ అధికారులు, పీఏసీఎస్ చైర్మన్, సీఈవో సంఘ సభ్యులు, ఆయిల్ ఫెడ్ అధికారులు, ఐకేపీ మహిళలు, అన్ని మండలాల నుంచి రైతులు వీక్షించారు.