యాంటీ పేపర్ లీక్ బిల్లుకు పార్లమెంటు ఆమోదంతో పరీక్షల పేపర్ లీక్‌లపై కఠిన చట్టం అమల్లోకి తీసుకరానున్నామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. నీట్ పేపర్ లీకేజీ, విద్యార్ధులు నిరసనలు, పార్లమెంటులో యాంటీ పేపర్ లీక్ బిల్లు ఆమోదం పరిణామాల క్రమంలో ప్రధాని మోదీ వరుసగా నాల్గవ వీడియో విడుదల చేయడం విశేషం.
తాజా వీడియోలో ప్రధాని మోదీ మాట్లాడుతూ..పరీక్షల వ్యవస్థను విశ్వసనీయంగా మార్చేందుకు కేంద్రం వరుస చర్యలు తీసుకుంటోందని తెలిపారు. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, యాంటీ పేపర్ లీక్ బిల్లుతో పేపర్ లీకేజీలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను ఏకరవుపెట్టారు.
పేపర్ లీక్ మాఫియాపై కఠిన చర్యలకు పార్లమెంట్‌లో తీసుకొచ్చిన బిల్లు రెండు సభల్లో ఆమోదం పొందిందని చెప్పారు. ఈ బిల్లు మన పరీక్షల నిర్వహణ వ్యవస్థను మరింత పటిష్టం చేయనుందని తెలిపారు. సాంకేతికతను పూర్తిగా వినియోగిస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడే పేపర్ లీక్ గ్యాంగ్ లను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.
మోదీ ఇన్‌ఫ్లూయెన్సర్‌గా మారిపోండి: సీజేపీ
పేపర్ లీకేజీ, విద్యార్ధుల నిరసనల నేపథ్యంలో ప్రధాని మోదీ వరుసగా సోషల్ మీడియాను వినియోగించుకోవడంపై కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకొని, దానికి బదులుగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారాలని వ్యంగ్యంగా సూచించారు. మోదీ ప్రధానిగా కంటే ఇన్‌ఫ్లూయెన్సర్‌గా ఉండటానికే ఎక్కువగా సరిపోతారని అనిపిస్తున్నదని అన్నారు.
పరీక్షల చట్టంపై మోదీ విడుదల చేసిన తాజా వీడియోపై దీప్కే స్పందిస్తూ, “దేశ భవిష్యత్తు కంటే మీ చర్మమే చాలా కాంతివంతంగా ఉంది” అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో సెటైర్ పేల్చారు. కేవలం కొత్త చట్టాలు తెచ్చినంత మాత్రాన పేపర్ లీక్ సమస్యలు పోవని, అమలు చేసే వారి ఉద్దేశాలు సరిగ్గా ఉండాలని విమర్శించారు.
పేపర్ లీక్ గ్యాంగ్‌లను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం అంటూ మరో రీల్ వదిలిన ప్రధాని నరేంద్ర మోదీ pic.twitter.com/n59H8usKjo
— greatandhra (@greatandhranews) July 31, 2026
