దేశ చరిత్రలో మహిళ రిజర్వేషన్ బిల్లు కీలక ఘట్టం: ప్రధాని మోదీ

మహిళా రిజర్వేషన్ బిల్లు దేశ చరిత్రలో కీలక ఘట్టమని ప్రధాని మోదీ అన్నారు. మహిళలకు రాజకీయాల్లో 33 శాతం ప్రాతినిధ్యం కల్పించడమే లక్ష్యమన్నారు.

విధాత : దేశ చరిత్రలో మహిళా రిజర్వేషన్ బిల్లు కీలక ఘట్టం అని ప్రధాని మోదీ అభివర్ణించారు. 131 రాజ్యాంగ సవరణ బిల్లుపై లోక్ సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. మహిళల్లో రాజకీయ చైతన్యం బాగా పెరిగిందని, పంచాయతీలలోనే కాదు అత్యున్నత చట్టసభల్లో కూడా సగ భాగం సగం కోరుకుంటున్నారని గుర్తు చేశారు. చీపురు పని కాదు..మాకు పార్లమెంట్ లో సీట్లు కావాలంటున్నారన్నారు. దేశానికి మేము కొత్త దిశను చూపిస్తున్నామని, వికసిత్ భారత్ అంటే కేవలం మౌలిక వసతులు కల్పన కాదు.. మహిళలను అందులో భాగస్వాములను చేయడమే లక్ష్యం అని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి అని గుర్తు చేశారు. పంచాయతీలో మహిళలకు రిజర్వేషన్లను అందరూ అంగీకరించారు కాని.. లోక్ సభలో అమలు చేస్తుంటే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. 30 ఏళ్ల క్రితమే ఆమోదించాల్సిన బిల్లు ఇప్పుడు సభ ముందుకు వచ్చిందన్నారు. మహిళలకు నిర్ణయాధికారం ఉండాలనేదే మా లక్ష్యం అని స్పష్టం చేశారు. రాజకీయాల్లో శక్తిని చూపించేందుకు మహిళలు సిద్దంగా ఉన్నారన్నారు.

బిల్లుకు మద్దతినిచ్చే పార్టీలకే మనుగడ

బిల్లుకు మద్దతిచ్చే పార్టీలకే రాజకీయ మనుగడ ఉంటుందని, 30 ఏళ్లలో ఇదే రుజువయిందని మోదీ తెలిపారు. 2029ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అమలు చేయకపోతే వారికి అన్యాయం జరుగుతుందన్నారు. ఈ బిల్లు వెనకు ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని, రాజకీయ పార్టీల కోసం ఈ బిల్లు తేలేదన్నారు. దేశం అంతా ఒక్కటేనని, ప్రాంతీయ విభేధాలు ఉండరాదని స్పష్టం చేశారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మాకు మాకు సమానమేనని, ఒక్కేటనని, ఉత్తర, దక్షిణ భారత్ అన్న బేధాలు లేవని, మా ఉద్దేశంలో భారత్ ఒక్కేటనని మోదీ తేల్చి చెప్పారు. చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగబోదని భరోసా ఇచ్చారు. ఇప్పుడు బిల్లును వ్యతిరేకించేవారు భవిష్యత్తు కాలంలో శిక్ష అనుభవిస్తారు అన్నారు. రిజర్వేషన్లు మహిళల హక్కు అని, ఈ బిల్లును వ్యతికేరించే దమ్ము ఏ పార్టీకి లేదు అని స్పష్టం చేశారు.

ఓబీసీకు న్యాయం చేస్తాం

మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీలకు తప్పకుండా న్యాయం చేస్తామని, ముందుగా ఈ బిల్లును ఆమోదించాలని ప్రధాని మోదీ సభ్యులను కోరారు. మునుముందు ఓబీసీ మహిళలకు ,ఇతర వర్గాల మహిళలకు కోటా గురించి ఆలోచిద్దాం అన్నారు. మీకు గ్యారంటీ కావాలంటే నా మాటే గ్యారంటీ అని మోదీ చెప్పుకొచ్చారు. పార్లమెంటుపై నాకు నమ్మకం ఉందని, బీసీ వర్గాలకు చెందిన నేను ప్రధాని అయ్యానని, ఓబీసీల మహిళలకు తప్పకుండా న్యాయం చేస్తామన్నారు. ముందుగా 33శాతం మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు ఆమోదం కానివ్వండని తెలిపారు. రాజకీయాల కోసం, మోదీ స్వార్ధం కోసం ఈ బిల్లును తెచ్చామంటున్నారని, విపక్షాలు బిల్లును వ్యతిరేకిస్తే వారికే నష్టం, నాకే లాభం అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై నాకు క్రెడిట్ అవసరం లేదని, అన్ని పార్టీల సహకారంపై రేపు ధన్యవాద ప్రకటన చేస్తానని తెలిపారు.

ఇవి కూడా చదవండి :

బిగ్ డే…లోక్ సభ ముందుకు మూడు కీలక బిల్లులు..ప్రతిపక్షాల నిరసనలు
స్వల్పంగా పెరిగిన బంగారం, స్థిరంగా వెండి!

Latest News