77-Ft Lord Ram Statue : శ్రీరాముడి భారీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

ప్రధాని మోదీ గోవాలో 77 అడుగుల శ్రీరాముడి భారీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. కర్ణాటకలో శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించి లక్ష కంఠ గీతా పారాయణంలో పాల్గొన్నారు.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Nov 28, 2025, 5:21 pm IST
Read Time: 3 mins
77-Ft Lord Ram Statue : శ్రీరాముడి భారీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

విధాత : ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన శ్రీరాముడి విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. గోవాలో ‘శ్రీ సంస్థాన్‌ గోకర్ణ పర్తగాలీ జీవోత్తమ్‌ మఠం’లో 77 అడుగుల శ్రీరాముడి భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మఠం 550వ వార్షికోత్సవం వేడుకలకు హాజరైన ప్రధాని మోదీ శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ అశోక్‌ గజపతిరాజు, సీఎం ప్రమోద్‌ సావంత్‌, పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. ఇదే రోజు ప్రధాని మోదీ కర్ణాటక పర్యటనలో భాగంగా ఉడుపిలోని ప్రసిద్ధ శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించారు. లక్ష కంఠ భగవద్గీత పఠనంలో పాల్గొని గీతా పారాయణం చేశారు.

ఈ సందర్బంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ గీతలో శ్రీకృష్ణుడి బోధనలు ప్రతి యుగానికి సంబంధించినవని గుర్తు చేశారు. మన జాతీయ విధానాన్ని అవి నిర్దేశిస్తాయని.. ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలని కృష్ణుడు బోధించాడని మోదీ పేర్కొన్నారు. శాంతి, సత్యాన్ని సాధించడం కోసం అవసరమైతే దురాగతాలకు పాల్పడే వారిని అణచివేయాలని గీత మనకు బోధిస్తుంది అని మోదీ తెలిపారు. గతంలో ఉగ్రదాడులు జరిగినప్పుడు అప్పటి ప్రభుత్వాలు ఏమీ చేయకుండా చూస్తుండిపోయాన్నారు. నయా భారత్‌ అలా కాదు. ఎవరి ముందు తలవంచదని. దేశ రక్షణ విషయంలో ఎన్నటికీ వెనుకడుగు వేయదని స్పష్టం చేశారు. ఆపరేషన్‌ సిందూర్‌లో మన సంకల్పాన్ని ప్రపంచం చూసిందని.. మన మిషన్‌ సుదర్శన చక్ర.. శత్రువులను నాశనం చేస్తుంది అని మోదీ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి :

Andhrapradesh Vs Telangana : బనకచర్ల కాదు..నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు
Akhanda 2 | కూకట్‌పల్లి లో ‘అఖండ-2’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ .. శుక్రవారం ట్రాఫిక్ మళ్లింపులు