Modi Meets Delhi Blast Victims : ఢిల్లీ బాంబు పేలుడు బాధితులకు ప్రధాని మోదీ పరామర్శ

ఢిల్లీ బాంబు పేలుడు బాధితులను ప్రధాని మోదీ పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచనలు, నిందితులను పట్టుకుంటామని భరోసా.

Modi Meets Delhi Blast Victims : ఢిల్లీ బాంబు పేలుడు బాధితులకు ప్రధాని మోదీ పరామర్శ

న్యూఢిల్లీ : ఢిల్లీ బాంబు పేలుళ్లలో గాయపడి ఎల్ ఎన్ జీపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ప్రధాని నరేంద్ర మోదీ పరామర్శించారు. రెండు రోజుల భూటాన్ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరిన ప్రధాని మోదీ..ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ఎల్ఎన్ జీపీ ఆసుపత్రికి వెళ్లారు. బాంబు పేలుడు ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.

ఘటన వివరాలు, చికిత్స అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి వారికి మెరుగైన వైద్య వసతులు అందించాలని తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. పేలుళ్ల వెనుక ఎవరున్న వదిలే ప్రసక్తి లేదన్నారు.