తెలుగు సింగర్ దుర్గాదేవి స్త్రోతానికి ప్రధాని మోదీ ఫిదా!

తెలుగు గాయని శ్రీలలిత ఆలపించిన దుర్గాదేవి స్తోత్రానికి ప్రధాని మోదీ ఫిదా అయ్యారు. నవరాత్రి సందర్భంగా ఆమె గానం వైరల్‌గా మారింది.

PM Modi

విధాత, హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు సింగర్ శ్రీ లలిత దుర్గాదేవి స్త్రోతానికి ఫిదా అయ్యారు. ఆమె ఆలపించిన దుర్గాదేవి స్త్రోతాన్ని తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసిన మోదీ జగదంబ మాతను పూజించడం మనసును అనంతమైన శక్తితో, ఆత్మవిశ్వాసంతో నింపుతుందని పేర్కొన్నారు. ఆ దివ్యమాత దివ్య తేజస్సు హృదయాన్ని దైవిక చైతన్యంతో ప్రకాశింపజేస్తుందని తెలిపారు.

అమ్మవారిని పూజించడం భక్తులలో నూతన విశ్వాసాన్ని నింపుతుందని, ఆమె ఆధ్యాత్మిక సాధన ప్రతిఒక్కరికి నూతన శక్తిని అందిస్తుందని పేర్కొన్నారు. చైత్ర నవరాత్రులలో ఆరవ రోజు కాత్యాయనీ మాతకు అంకితం చేయబడిన శ్రీలలిత గానం చేసిన ఓ భక్తి గీతాన్ని నరేంద్ర మోదీ తన పోస్ట్‌లో పంచుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడకు చెందిన భమిడిపాటి శ్రీలలిత తెలుగు, కర్ణాటక సంగీత గాయనిగా ప్రఖ్యాతి పొందారు. గాయని శ్రీలలిత నవరాత్రి సిరీస్‌లోని దుర్గాదేవి స్తుతి గీతం కోటికి పైగా వ్యూవర్స్ ను సాధించి రికార్డు సృష్టించింది. శ్రీలలిత నాలుగు సంవత్సరాల వయస్సు నుంచే సంగీతాన్ని అభ్యసించడం ప్రారంభించి..తన ఆరేళ్ల వయస్సులోనే గాన ప్రదర్శనను ప్రారంభించింది. ఈమె సరిగమప లిటిల్ చాంప్స్‌లో తన పాటలతో ఆకట్టుకుంది. తర్వాత పాడుతా తీయగా సీజన్ 6 రన్నర్ అప్ గా నిలిచింది, సూపర్ సింగర్స్ సీజన్ 9, బోల్ బేబీ బోల్, స్వరాభిషేకం తదితర టెలివిజన్ షోలలో తన పాటలతో కోట్లాది మంది అభిమానులను అలరించింది.

ఇవి కూడా చదవండి :

కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి రాజీనామా..లేఖ విడుదల
Kavitha Demands OBC Sub Quota | మహిళా రిజర్వేషన్లలో సబ్ కోటా ఇవ్వాలి : కవిత

Latest News